- Home
- Life
- Sri Rama Navami 2022: రాములోరికి సమర్పించే పానకం, వడపప్పు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా..
Sri Rama Navami 2022: రాములోరికి సమర్పించే పానకం, వడపప్పు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా..
Sri Rama Navami 2022: శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన పానకం, వడపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రోజు వీటిని తీసుకోవడం వల్ల చలువ చేయడమే కాదు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

sri rama navami
Sri Rama Navami 2022: శ్రీరామ నవమి రానే వచ్చింది. ఇక ఈ రోజు శ్రీరాముడిని నిష్టగా పూజించి.. నైవేద్యం పెడుతుంటారు. అయితే శ్రీరాముడికి ఇష్టమైన పానకం, వడపప్పు లను ఈ రోజకు చేసిన ఆ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
శ్రీరామ నవమి ఎండాకాలంలో వస్తుంది. అయితే ఈ సీజన్ లో మనకు ఎన్నో రోగాలు సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మండుతున్న ఎండలకు వడదెబ్బ కొట్టే అవకాశం ఉంది. ఈ వేసవిలో వచ్చే రోగాలను నయం చేయడానికి వడపప్పు, పానకం ఎంతో ఉపయోగపడతాయి. మరి ఈ వడపప్పు, పానకం తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పానకం లాభాలు.. ప్రతి దేవుడికి సమర్పించే నైవేద్యాలు కాలాలకు అనుగుణంగానే మన పెద్దలు నిర్ణయించారు. కాగా ఈ శ్రీరామ నవమి స్పెషల్ గా వడపప్పు, పానకం, చలిమిడిని తయారుచేస్తారు. పానకాన్ని నీళ్లు, బెల్లం, యాలకులు, మిరియాలతో తయారుచేస్తారు. ఈ పానకం తాగడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది. ఇకపానకంలో వాడే బెల్లంతో మన శరీరానికి కావాల్సిన ఇనుము లభిస్తుంది.
ఈ పచ్చడిని కేవలం శ్రీరామ నవమినాడే కాదు ఎప్పుడైనా చేసుకుని సేవించవచ్చు. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా. బెల్లం వల్ల రక్తహీనత సమస్య వదిలిపోతుంది. అంతేకాదు ఈ పానకాన్ని మహిళలు తాగడం వల్ల పీరియడ్స్ లో వచ్చే ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
వడపప్పు లాభాలు.. శ్రీరాముడికి సమర్పించే వడపప్పును పెసరపప్పుతో తయారుచేస్తారు. ఈ సీజన్ లో పెసరపప్పును తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. ముఖ్యంగా పెసరపప్పు శరీర ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. అలాగే వడదెబ్బ కొట్టకుండా మనల్ని రక్షిస్తుంది. వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా ఈ పప్పు ఎంతో సహాయపడుతుంది. ఈ పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
డయాబెటీస్ పేషెంట్లు పెసరపప్పును తింటే మంచిది. ఈ పప్పులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి ఎన్నో పోశకాలు మన శరీరానికి అందుతాయి. అంతేకాదు వీటిలో ఫైబర్, ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీకొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి.
చలిమిడిని వరిపిండి, బెల్లంతో తయారుచేస్తారు. ఈ వేసవిలో చలిమిడిని తింటే చలువ చేస్తుంది. ఇక ఇందులో ఉపయోగించే బెల్లం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. అయితే చాలామంది చక్కెరతోనే చలిమిడిని తయారుచేస్తారు. ప్రాసెస్ చేసిన చక్కెరతో చలిమిడిని తయారుచేస్తే మన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.