రాత్రి పడుకునే ముందు వాకింగ్ చేస్తే ఏమౌతుంది?
ఉదయంపూట వాకింగ్ అందరూ చేస్తారు. కానీ.. రాత్రి పడుకునే ముందు వాకింగ్ చేస్తారా? అలా చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...
నడక ప్రయోజనాలు
రోజూ నడవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. అందుకే చాలా మంది ఉదయం లేవగానే వాకింగ్ కి వెళ్తూ ఉంటారు. కానీ... రాత్రి వాకింగ్ కి ఎప్పుడైనా వెళ్లారా..? అది కూడా పడుకోవడానికి అరగంట ముందు వాకింగ్ చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయట. "Nutrients 2022" లో ప్రచురించిన ఓ పరిశోధన ప్రకారం, ముప్పై నిమిషాలు నడవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది, నిద్రలో కూడా కేలరీలు ఖర్చవుతాయి.
పడుకునే ముందు నడవడం వల్ల బరువు తగ్గడానికి లేదా బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. ఇంకా ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
నడక ప్రయోజనాలు
మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది
సాయంత్రం నడక మన శరీరక ఆరోగ్యంతో పాటు మనసు ఆరోగ్యానికి చాలా మంచిది. పలు సర్వేలు చేసిన పరిశోధనల ప్రకారం, నడక మానసిక ఒత్తిడి, ఆందోళన లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రి నడవడం వల్ల ప్రతికూల ఆలోచనల నుండి బయటపడటానికి, రోజులో జరిగిన సంఘటనలను జీర్ణించుకోవడానికి మన మనసుకు సమయం దొరుకుతుంది.
నడక ప్రయోజనాలు
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
చాలా మందికి రాత్రి భోజనం తర్వాత అజీర్తి లేదా కడుపు ఉబ్బరం వస్తుంది. అమెరికన్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల శరీరం ఆహారాన్ని చిన్న ముక్కలుగా విడగొట్టడానికి సహాయపడుతుంది, జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
సరైన నడక
నడవడం అంటే.. మరీ నెమ్మదిగా నడవకూడదు. కనీస వేగంతో అయినా నడవాలి.కనీసం మీ హృదయ స్పందన రేటును నెమ్మదిగా పెంచే వేగంతో నడవడానికి ప్రయత్నించండి.
నడక ప్రయోజనాలు
పార్క్ లేదా ప్రశాంతమైన ప్రదేశం లాంటి ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. ఇక్కడ నడవడానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. నడక తర్వాత, మీరు విశ్రాంతి తీసుకోండి, ముఖ్యంగా మీ వీపు, కాళ్ళకు తేలికపాటి సాగదీసేలా కొన్ని వ్యాయామాలు చేయండి.