Naga panchami 2022: బంధువులకు, సన్నిహితులకు నాగపంచమి విషెస్ ను చెప్పండిలా..
Naga panchami 2022: ప్రతి ఏడాది శ్రావణ మాసంలో శుక్ల పంచమినాడు నాగపంచమిని భారతదేశ వ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భంగా బంధువులకు, సన్నిహితుకు నాగపంచమి విషెస్ ను ఇలా తెలియజేయండి.
ఈ రోజు (ఆగస్టు 2) నాగ పంచమి. ఈ పండుగను భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు. భక్తులంతా నాగ దేవతకు పాలు, పండ్లు సమర్పించి పూజ చేస్తారు. ఈ నాగ పంచమి సందర్భంగా కోట్స్, ఫేస్ బుక్ స్టేటస్, వాట్సాప్ స్టేటస్ లను షేర్ చేయండి.
ఇంతటి పవిత్రమైన రోజున ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
చెడుతో పోరాడటానికి మీకు కొండంత శక్తిని ప్రసాధిస్తాడు. ఆపదల నుంచి రక్షిస్తాడు.. నాగ పంచమి శుభాకాంక్షలు 2022
ఈ నాగ పంచమి సందర్భంగా మీకు విజయం కలుగుతుంది. నేను ఆ శివుడిని ప్రార్థిస్తున్నారు.. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని. Happy Nag Panchami!
నాగ దేవత మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించుగాక. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటూ..Happy Nag Panchami!
పవిత్రమైన నాగపంచమి రోజున ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఎన్నో కష్టాల నుంచి బయటపడేస్తాడు.
మిమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తాడు.. మీకు మీ కుటుంబ సభ్యులకు నాగ పంచమి శుభాకాంక్షలు
నాగ దేవతలకు పాలు, పండ్లు నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆ భగవంతుడి దయ ఎప్పుడూ మీపై ఉంటుంది. నాగ పంచమి శుభాకాంక్షలు
నాగపంచమి రోజున ఆ భోళాశంకరుడిని నిష్టగా పూజిస్తే ఎన్ని కష్టాలనైనా అలవోకగా ఎదుర్కొనే ధైర్యం మీకొస్తుంది. ప్రతిదాంట్లో విజయం సాధించే పట్టుదల పుడుతుంది. హ్యాపీ నాగపంచమి
ఈ నాగ పంచమి సందర్భంగా మీ జీవితం ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటన్నా..
ఎలాంటి కష్టాలు రాకుండా ఆ భగవంతుడు మీకు అండగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ నాగ పంచమి