MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • వానాకాలంలో ఈ తప్పులు చేస్తే మీ జుట్టు విపరీతంగా రాలుతుంది జాగ్రత్త..

వానాకాలంలో ఈ తప్పులు చేస్తే మీ జుట్టు విపరీతంగా రాలుతుంది జాగ్రత్త..

వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలన్నా, డ్యామేజ్ కావొద్దన్నా జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. అంతేకాదు వర్షాకాలంలో కొన్ని తప్పులు మీ జుట్టు విపరీతంగా రాలేలా చేస్తాయి. అందుకే ఈ తప్పులు చేయకుండా ఉండాలి. 

Mahesh Rajamoni | Published : Jul 28 2023, 03:37 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
hair care

hair care

వర్షాకాలంలో జుట్టు బాగా దెబ్బతింటుంది. పెరిగిన తేమ మన నెత్తిమీద చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. దీని వల్లే ఈ సీజన్లో జుట్టు విపరీతంగా రాలుతుంది. అంతే కాదు ఈ సమయంలో మీ జుట్టు గరుకుగా, జిడ్డుగా ఉంటుంది. ఈ సమస్యలు రావొద్దంటే జుట్టు సంరక్షణ చిట్కాలను తప్పకుండా పాటించాలి. కానీ చాలా మంది ఈ విషయంలోనే తప్పు చేస్తారు. దీనివల్లే జుట్టు బాగా రాలుతుంది.  వర్షాకాలంలో జుట్టు రాలడం, డ్యామేజ్ కాకుండా ఉండాలంటే జుట్టును జాగ్రత్తగా చూసుకోవడంతో పాటుగా వర్షాకాలంలో జుట్టుకు సంబంధించిన తప్పులను చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26
hair care

hair care

తలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం

సాధారణంగా కొంతమంది ఆడవారు ప్రతిరోజూ తలస్నానం చేస్తుంటారు. అయితే సీజన్ లో జుట్టు చాలా త్వరగా మరింత జిడ్డుగా, గరుకుగా మారుతుందని నమ్ముతారు. కానీ రోజూ తలస్నానం చేయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది జుట్టును మరింత డ్యామేజ్ చేస్తుంది.  ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల నెత్తిమీద ఉండే నేచురల్ ఆయిల్ తగ్గిపోతుంది. దీని వల్ల మీ జుట్టు మరింత ఫిజీగా మారుతుంది.మీ నెత్తి జిడ్డుగా ఉంటే వారానికి 3 సార్లు తలస్నానం చేయండి. మీ నెత్తి సాధారణంగా ఉంటే మీరు వారానికి 2 సార్లు తలస్నానం చేయండి. మీరు ప్రతిరోజూ ఆఫీసు నుంచి లేదా ఎక్కడికైనా బయటకు వెళితే వారానికి 3 సార్లు తలస్నానం చేయండి. అయితే తలను కడగడానికి సల్ఫేట్ లేని మైల్డ్ షాంపూను ఉపయోగించండి.
 

36
hair care

hair care


వర్షంలో తడిసిన వెంటనే తలస్నానం

వర్షాకాలంలో జుట్టు తడవడం చాలా సహజం. ఎందుకంటే ఈ సీజన్ లో ఎప్పుడైనా, ఎక్కడైనా వర్షం కురిసే అవకాశం ఉంది. అందుకే మీరు బయటకు వెళ్లే ముందు గొడుగును తప్పకుండా తీసుకెళ్లండి. కానీ కొన్నిసార్లు జుట్టు తడిసే అవకాశం ఉండొచ్చు. అయితే జుట్టు తడిస్తే వెంటనే మీ జుట్టును తేలికపాటి షాంపూతో బాగా కడగండి. ఇలా చేయకపోవడం వల్ల నెత్తిమీద జిడ్డు, దురద, చుండ్రుతో పాటు జుట్టు రాలే సమస్య కూడా పెరుగుతుంది.
 

46
hair care

hair care


హెయిర్ ఆయిల్ 

వర్షాకాలంలో మీ జుట్టు జిడ్డుగా మారినా ఖచ్చితంగా నూనె పెట్టాలి. షాంపూ చేసే ముందు జుట్టుకు నూనెను రాయండి. ఎందుకంటే ఇది మీ నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది. జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది. అంతేకాదు వర్షాకాలంలో వచ్చే జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది. సాధారణంగా మనం రాత్రంతా నూనె పెట్టి ఉదయం తలస్నానం చేస్తాం. కానీ  ర్షాకాలంలో తలస్నానం చేయడానికి 2 గంటల ముందు నూనెను అప్లై చేయండి. ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది. అలాగే  జుట్టు జిడ్డుగా కనిపించే అవకాశం కూడా ఉండదు.
 

56
Asianet Image

కండిషనర్ ను స్కిప్ చేయడం

వానాకాలంలో తేమ కారణంగా నిర్జలీకరణానికి గురవుతుంది. దీని వల్ల దువ్వడం కష్టమవుతుంది. అందుకే తలస్నానం చేసిన వెంటనే కండీషనర్ అప్లై చేయడం మర్చిపోకండి. మీ జుట్టు చివర కండీషనర్ ను బాగా పెట్టండి. ఎందుకంటే ఈ సమయంలో జుట్టు దిగువ భాగం ఎక్కువగా ప్రభావితమవుతుంది. కండీషనర్ మీ జుట్టును మృదువుగా చేయడమే కాకుండా చిక్కులు పడకుండా కూడా చేస్తుంది. అంతేకాదు జుట్టును షైనీగా చేస్తుంది. వర్షం వల్ల జుట్టు దెబ్బతినకుండా రక్షిస్తుంది. 

66
hair care

hair care

హీట్ స్టైలింగ్ 

హీట్ స్టైలింగ్ మీ జుట్టుకు అస్సలు మంచిది కాదు. మీ జుట్టు ఇప్పటికే గరుకుగా ఉంటే ఇది వర్షాకాలంలో మీ జుట్టును మరింత దెబ్బతీస్తుంది. అతేకాదు మీ జుట్టు మరింత బలహీనంగా మారుతుంది. ముఖ్యంగా కీస్ట్రైటర్, డ్రయ్యర్, కర్లింగ్ వంటి హీట్ స్టైలింగ్ సాధనాలను ఉపయోగించడం వల్ల మీ జుట్టు ఎక్కువ దెబ్బతింటుంది. వీటి వాడకం వల్ల మీ జుట్టు నిర్జీవంగా, పొడిగా మారుతుంది. అందుకే మీ జుట్టును సహజంగా ఆరనివ్వండి. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Gold Chain: 5 గ్రాముల్లో బంగారు చైన్.. చూస్తే వెంటనే కొనేస్తారు!
Gold Chain: 5 గ్రాముల్లో బంగారు చైన్.. చూస్తే వెంటనే కొనేస్తారు!
ఫ్లోరల్ ప్రింట్ సారీస్ కి ఈ బ్లౌజులు సూపర్ గా సెట్ అవుతాయి!
ఫ్లోరల్ ప్రింట్ సారీస్ కి ఈ బ్లౌజులు సూపర్ గా సెట్ అవుతాయి!
Fashion tips: ఇలాంటి ఫ్యాన్సీ సూట్ సెట్స్ ఎప్పుడైనా ట్రై చేశారా?
Fashion tips: ఇలాంటి ఫ్యాన్సీ సూట్ సెట్స్ ఎప్పుడైనా ట్రై చేశారా?
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Hot on Web
  • Nara Chandrababu Naidu
  • Pawan Kalyan
  • Telugu News
  • District News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Nellore News
  • Guntur News
  • Hyderabad News
  • Popular Categories
  • Life Style
  • International News
  • Entertainment
  • Fact Check
  • Sports
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved