గోవా వెళ్లి ఎంజయ్ చేద్దామనుకుంటున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే !
Goa Tour: గోవాకు వెళ్లడానికి ఉత్తమ సమయం నవంబర్, డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య.. అందమైన బీచ్‌లను ఆస్వాదించడానికి, ఇక్కడి ప్రకృతి దృశ్యాలను చూడటానికి మంచి వాతావరణం ఉంటుంది. అయితే, గోవా వెళ్లడానికి ముందు మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
గోవా ట్రిప్ ఖర్చు
గోవాలో ప్రస్తుతం పర్యాటకులకు అద్భుతమైన వాతావరణం కలిగి ఉంటుంది. దేశీయ-అంతర్జాతీయ సందర్శకులకు ఉత్సాహభరితమైన హాట్‌స్పాట్‌గా ఉన్న గోవాలో నవంబర్, డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య అక్కడి పరిసరాలను ఎంజయ్ చేయడానికి సరైన సమయం. ఈ సమయంలో గోవాలో పర్యాటకుల కోసం అనేక ఈవెంట్స్ జరుగుతుంటాయి. 31st అండ్ న్యూ ఇయర్ వేడుకలు అయితే అదరిపోతాయి. ఈ సమయంలో జరిగే ఈవెంట్లు చూస్తే కళ్లు చెదిరిపోతాయని చెప్పాలి. మీరు కూడా గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీరు మొదట ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే.. !
గోవా టూర్ ప్యాకేజీలు
భారత్ లో అద్భుతమైన పర్యాటక ప్రాంతం గోవా
గోవా ట్రిప్ వెళ్లాలని ఉందా? ఎంత ఖర్చవుతుందో తెలుసుకోండి. చాలా మంది గోవా వెళ్లాలనుకుంటారు కానీ ఖర్చు భయంతో ఆగిపోతారు. గోవా ట్రిప్‌కి ఎంత ఖర్చవుతుందో తెలిస్తే ముందుగానే డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
గోవా భారతదేశంలో పర్యాటకులకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, ఉత్సాహభరితమైన సంస్కృతి, ఆహ్లాదకరమైన సముద్రతీర గాలితో గోవా పర్యాటకుల హృతులను కట్టిపడేస్తుంది. అక్కడ కలంగుట్ బీచ్ తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం.
గోవా ట్రిప్ బడ్జెట్
గోవా ట్రిప్ కు బడ్జెట్ కూడా ముఖ్యమే
అందమైన దృశ్యాలు, ఉత్తేజకరమైన ఈవెంట్స్, ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ఈ బీచ్, ముఖ్యంగా సాహస యాత్రికులలో ప్రసిద్ధి చెందింది. మీరు గోవాకు ట్రిప్ ప్లాన్ చేస్తే, ముఖ్యంగా పండుగ నెలలైన డిసెంబర్, జనవరిలో, బడ్జెట్ వేసుకోవడం చాలా ముఖ్యం. రద్దీగా ఉంటుంది. అక్కడ ఉండే అన్నింటిని మీరు ఎంజయ్ చేయాలనుకుంటే బడ్జెట్ పెరగవచ్చు.
గోవా ట్రిప్
గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
గోవా ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో కోలాహలంగా ఉంటుంది. దాదాపు ప్రతి బీచ్‌లోనూ అద్భుతమైన అలంకరణలు, గ్రాండ్ పార్టీలు జరుగుతాయి. ట్రావెల్ తో పనిలేకుండా మీరు అక్కడి వెళ్లిన తర్వాత స్కూటీ లేదా బైక్ ను తీసుకుని గోవా పరిసరప్రాతాలను చూడవచ్చు. బైక్, స్కూటీ అద్దె రోజుకి ₹200 నుండి ₹250 వరకు ఉంటుంది, డిసెంబర్‌లో ₹500 లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. కానీ, అక్కడ ఈ సర్వీసులను అందించే ఇద్దరుముగ్గురిని అడిగితే మీకు తక్కువ ధరకు లభించే వారు కూడా ఉంటారు.
గోవా ట్రిప్ బడ్జెట్
గోవా పర్యటన-ముందుగానే ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు
హోటల్ గదులు సాధారణంగా రాత్రికి ₹1,000 ఖర్చవుతుంది, పీక్ సీజన్‌లో ₹2,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చవుతుంది. ఖర్చు ఆదా చేయాలంటే ఆఫ్-సీజన్‌లో గోవా ట్రిప్ ప్లాన్ చేసుకోండి. సాధారణంగా ఉండే హోటళ్లు కూడా ఉంటాయి. అక్కడ మీరు ఒక వ్యక్తికి 300 నుంచి కూడా ఒక రాత్రికి ఛార్జీ చేసేలా సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే, ఇది ఆఫ్ సీజన్ అని గుర్తుంచుకోండి. సాధారణంగా ప్రస్తుతం రద్దీగా ఉంటే సీజన్ కాబట్టి బస చేయడానికి హోటల్ ఖర్చులు ఎక్కువగానే అవుతాయని తెలుసుకోండి. దీనికి అనుగుణంగా ముందుగానే బుక్ చేసుకునే సదుపాయాలు కల్పిస్తున్నాయి కాబట్టి మీ బడ్జెట్ అంచనాలు చూసుకోండి.
తక్కువ ఖర్చుతో కూడిన ట్రిప్
గోవా పర్యటన-ఆఫ్ సీజన్ లో ఖర్చు తక్కువ
గోవాలో నవంబర్, డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య మంచి సీజన్.. కాబట్టి కాస్త ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కానీ, మీరు ఎంచుకునే కార్యకలాపాలను బట్టి గోవా ట్రిప్ ఖర్చు మారుతుంది. ఆఫ్-సీజన్ నెలల్లో ₹10,000 నుండి ₹30,000 వరకు బడ్జెట్‌తో మంచి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు చూడాల్సిన అన్ని ప్రాంతాలు ఇందులో చూడవచ్చు.
గోవా టూరిజం
గోవాలో వీటిని తప్పక చూడండి
డిసెంబర్, జనవరి నెలల్లో 3 రాత్రులు, 4 రోజుల ట్రిప్‌కి ₹50,000 నుండి ₹80,000 వరకు బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. ఈ బడ్జెట్‌లో వసతి, రవాణా, భోజనం, కార్యకలాపాలు ఉంటాయి. కాబట్టి ఆఫ్ సీజన్ లో కంటే ఈ రద్ది సీజన్ లో మీకు ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఈ ట్రిప్ లో మీరు తక్కువ ప్రదేశాలు చూడటం లేదా ఈవెంట్స్ లో పాల్గొనడం చేస్తే ఈ ఖర్చు కొద్దిగా తగ్గవచ్చు.
గోవా పర్యటనలో మారియో మిరాండా గ్యాలరీ, ఆదిల్ షా ప్యాలెస్, టాటో, డోనా పౌలా, గ్రేసియా డీ ఒర్టా, కేఫ్ సెంట్రల్, బాగా బీచ్, దూద్ సాగర్ జలపాతం, పలోలెం బీచ్, అగోండా బీచ్, కొలంగెట్ బీచ్ లను మీరు తప్పక చూడాల్సిన ప్రదేశాల లిస్టులో పెట్టుకోండి. అద్భుతంగా ఉంటాయి.. !