అందమైన పాదాల కోసం..
for smoothy feet: పాదాల పగుళ్ల సమస్య రకరకాల కారణాలతో వస్తుంటాయి. కారణాలేవైనా వాటిని సకాలంలో పరిష్కరించకపోతే.. పాదాల పగుళ్ల నుంచి రక్తం కారే ప్రమాదముంది.

feet
పదాలను సరిగ్గా క్లీన్ చేయకపోయినా.. ఒంట్లో వేడి ఎక్కువైనా.. పాదాలు పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఈ సమస్య కారణంగా చాలా మంది సరిగ్గా నడవలేకపోతుంటారు. కొన్ని కొన్ని సార్లైతే.. పగుళ్ల నుంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది. ఈ సమస్య అలాగే వదిలిస్తే సరిగ్గా నడవడం కూడా కష్టమవుతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు. అవేంటంటే..
అరటి పండు: అరటిపండు మంచి పోషకాహారం. రోజుకు ఒక అరటిపండును తింటే మన ఆరోగ్యానికి ఏ ఢోకా లేదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ పండు నేచురల్ మాయిశ్చరైజర్ లా కూడా పనిచేస్తుంది. డ్రై స్కిన్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది కూడా.
పాదాల పగుళ్లు పోవాలంటే రెండు అరటిపండ్లను తీసుకుని వాటిని పేస్ట్ లా చేయాలి. ఆ పేస్ట్ ను పాదాలకు రాసి.. అరగంట తర్వాత క్లీన్ చేయాలి. క్రమం తప్పకుండా రెండు వారాల పాటు ఈ పద్దతిని ఫాలో అయితే పాదాల పగుళ్ల నుంచి ఉపశమనం కలుగుతుంది.
చిన్న బకెట్ గోరు వచ్చని నీళ్లలో ఒక కప్పు తేనె ను మిక్స్ చేయాలి. ఆ నీళ్లలో పాదాలను ఒక 20 నిమిషాల పాటు పెట్టాలి. వాటిని కాసేపు మసాజ్ చేసి.. పొడిగా ఉండే టవల్ తో తుడవాలి. ఆ తర్వాత పాదాలకు మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.
బకెట్ గోరువెచ్చని నీళ్లను తీసుకుని అందులో పాదాలను ఇరవై నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత పాదాలను తడిలేకుండా తుడిచి.. టీ స్పూన్ వ్యాజిలైన్ తీసుకుని అందులో నాలుగు నిమ్మరసం డ్రాప్స్ ను వేబా బాగా కలిపి.. పాదాలకు రాయాలి. తర్వాత సాక్స్ లనుు వేసుకుని పడుకుంటే పాదాల పగుళ్లు మటుమాయమవుతాయి.
foot cracks
ఒక పదినిమిషాల పాటు పాదాలను గోరువెచ్చని నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత బియ్యపు పిండిని రెండు టీస్పూన్లు తీసుకుని అందులో నాలుగు చుక్కల వెనిగర్, టీ స్పూన్ తేనె వేసి బాగా కలగలపాలి. ఈ మిశ్రమాన్ని పగుళ్లకు రాయాలి. వారానికి మూడు సార్లు ఇలా చేస్తే పగుళ్లు మటుమాయం అవుతాయి.