Food Facts: మనం తినే ఈ ఫుడ్స్.. మన దేశానివి కావన్న విషయం మీకు తెలుసా..?
Food Facts: మనకు తెలియని విషయాలను తెలుసుకోవాలన్న కుతూహలత అందరికీ ఉంటుంది. అందుకే కదా.. తెలియని విషయం గురించి .. గూగుల్ లో వెతికి మరీ తెలుసుకుంటాం.. అయితే ఇప్పుడు మన దేశంలో కొన్ని ఫేమస్ ఆహార పదార్థాల గురించి అసలు నిజం తెలుసుకుందాం..

1. సుగంధ ద్రవ్యాలు (Spices)
భారతదేశాన్ని సుగంధ ద్రవ్యాల భూమి అని కూడా పిలుస్తారు. ఎందుకో తెలుసా.. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా భారతదేశం అంత ఎక్కువ సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేయదు.
ఇవే కావు పోర్చుగీసు వారు మన దేశానికి శుద్ధి చేసిన చక్కెరను కూడా పరిచయం చేశారు. ఇది మన దేశంలోకి రాకముందు మన దేశంలో తేనెను, కొన్ని రకాల పండ్లను స్వేటెనర్లుగా ఉపయోగించేవారు.
చిక్కెన్ టిక్కా మసాలా (Chicken Tikka Masala)
చికెన్ టిక్కా మసాలా అంటే ఇష్టపడని వారుండరు. ఇది మన దేశంలో ప్రసిద్ధ వంటకం కూడా. కానీ ఇది మన దేశానికి చెందిన వంట అసలే కాదు. ఇది స్కాట్లాండ్ లోని గ్లాస్గోల్ లో ముందుగా తయారుచేశారు.
అమెరికాలో భారతీయ మొట్టమొదటి రెస్టారెంట్ 1960 మధ్య కాలంలో ప్రారంభించారు. కానీ ప్రస్తుతం అమెరికాలో భారతీయ రెస్టారెంట్లు 80,000 లకు పైగానే ఉన్నాయి.
<p>Indus valley Civilization </p>
తొలి భారతీయ నాగరికత అయిన సింధూలోయ నాగరికత ఆహారపు అలవాట్లు గురించి తెలిసిన వారు చాలా తక్కువ మందే అని చెప్పాలి. ఎందుకంటే భాష అప్పటి ఎవరికీ అర్థం కాలేదు.
ఇండియన్ ఫుడ్ థియరీ ప్రకారం.. మనం తినే ఆహారంలో ఆరు భిన్నమైన రుచులుంటాయి. చేదు, ఉప్పు, తీపి, పుల్లగా, కారంగా, ఆస్ట్రింజెంట్ గా ఉంటాయి. ఈ సారి అన్నం తిన్నప్పుడు మీ వంటలో ఈ రుచులు ఉన్నాయో లేదో అంచనా వేయండి.
ఇండియాలో మిరపకాయలను, టొమాటోలను, బంగాళా దుంపలను ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో టొమాటోలు లేని కూరలు అసలే ఉండదు. అలాంటి ఈ టొమాటోలు అసలు మనదేశానివే కావన్న ముచ్చట మీకు తెలుసా..? వీటిని పోర్చుగీసు వారు భారత దేశానికి తీసుకొచ్చారు.
చట్నీలను ఇష్టపడని వారుండరేమో.. అందుకే ఎలాంటి కూరతో తిన్నా.. ప్లేట్ లో ఓ పక్క పక్కాగా చట్నీ ఉంటుంది. అయితే మనలాగే బ్రిటీషర్లకు కూడా చట్నీలంటే మహా ఇష్టమట. ఈ చట్నీలలో బ్రిటీషర్లు ఒకదానికి మేజర్ గ్రేస్ అని పేరు పెట్టారు. ఇది భారతదేశంలో కూడా లభిస్తుంది. ఇది ప్రసిద్ది చెందిన వంటకం కూడాను.
మనం జరుపుకునే ప్రతి వేడుకలో మిఠాయిలూ తప్పకుండా ఉంటాయి. అయితే దక్షిణ భారతదేశ ప్రజలకు ఇష్టమైన తీపి వంటకాల్లో పాయసం ఒకటి. దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం.. పెళ్లిలో పాయసం వడ్డించే వరకు వివాహ తంతు పూర్తికాదట.