ఈ అలవాట్లు మూర్ఖులు, తెలివి తక్కువ వారికే ఉంటాయి.. వీళ్లు ఇంట్లో వాళ్లకు కూడా నచ్చరు
మనకున్న అలవాట్లే జనాలు మనతో ఎలా ఉండాలో డిసైడ్ చేస్తాయి. అయితే కొన్ని అలవాట్లు ఎక్కువగా తెలివితక్కువ వాళ్లకు, మూర్ఖులకే ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రతి ఒక్కరికీ కొన్ని ప్రత్యేకమైన, కొన్ని కామన్ అలవాట్లు ఉంటాయి. కానీ ఇవే మనల్ని ఇతరుల ముందు మంచి వారిగా లేదా చెడు వారిగా నిలబెడతాయి. కొన్ని అలవాట్ల కొంతమంది వేరేవాళ్లకు అస్సలు నచ్చరు. ఇలాంటి వారినే సమాజం మూర్ఖులుగా ముద్రిస్తుంది. వీరు జనాల మధ్యలోకి వచ్చిన తర్వాత వింతగా మాట్లాడుతుంటారు. అవతలి వారిని వెక్కిరిస్తుంటారు. వీళ్లు ఎవ్వరి మాటలను సీరియస్ గా తీసుకోరు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే? వీళ్లు తమను తాము పెద్దవారిగా, తెలివైన వారిగా భావిస్తారు. వీళ్లు తెలివైన వారిని తమకు ముప్పుగా భావిస్తారు. అసలు మూర్ఖులకుండే అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నాకు అన్నీ తెలుసు
మూర్ఖులకుండే ఒక గొప్ప లక్షణమేంటంటే? వీళ్లు తమకు తామే ఎంతో తెలివైన వారిమని భావిస్తారు. మూర్ఖులు తమకు అన్నీ తెలుసని అనుకుంటాడు. అజ్ఞానులే తమ జ్ఞానాన్ని అతిగా ప్రచారం చేస్తారనే ఒక కవిత కూడా ఉంది. అంతేకాకుండా ఇలాంటి వారు ఎప్పుడూ కూడా పనికిరాని సలహాలు ఇస్తుంటారు. కానీ వీళ్లకు ఎవ్వరూ రెస్పెక్ట్ ఇవ్వరు.
సహనం లేకపోవడం
తెలివితక్కువ వారిలో ఉండే మరొక కామన్ లక్షణ.. సహనం లేకపోవడం. బాగా తెలివి తేటలున్న వారు ఎలాంటి పరిస్థితిలోనైనా ఎంతో ప్రశాంతంగా ఉంటారు. అదే మూర్ఖులు అయితే చిన్న పాటి విషయానికే కంగారు పడి సహనం కోల్పోతుంటారు. తెలివితక్కువ వారికి చిన్నపాటి విషయాలకే తిట్టడం, అసహ్యించుకోవడం, కోపం రావడం చాలా సహజం.
తమను తామే పొగిడే వ్యక్తులు
తెలివి తక్కువ వారిలో ఉండే మరొక లక్షణం ఎప్పుడూ కూడా వారిని వారే బాగా పొడుగుటుంటారు. ప్రశంసించుకుంటారు. ఇలాంటి వారికి ఇతరులను ప్రశంసించడం అస్సలు నచ్చదు. అవసలి వారిని చూసి ఓర్వలేకపోతుంటారు. ఇలాంటి వారికి అహంకారం ఎక్కువగా ఉంటుంది. వీళ్లు ఇతరులు సాధించిన విజయాలను పట్టించుకోకుండా తమనే పొగుడుకుంటుంటారు. దీనివల్లే వీరికి సమాజంలో గౌరవం ఉండదు.
ఆలోచించకుండా పని చేస్తారు
తెలివితక్కువ వారు ఏ పనీ పూర్తిగా ఆలోచించరు. దీనివల్లే వీరికి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎక్కువగా వస్తుంటాయి. ఏ నిర్ణయమైనా తొందరపడి తీసుకోవడం మూర్ఖులకున్న సాధారణ లక్షణం. దీనివల్లే వీళ్లంతట వీళ్లే ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. వీళ్ల వల్ల కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది.
ఇతరులను అవమానించేవాడు
తక్కువ మెదడు ఉన్నవారు తమను తాము ఉన్నతంగా భావించడమే కాకుండా.. ఏ కారణం లేకుండా ఇతరులను అవమానిస్తుంటారు. అంతేకాదు ఇలాంటి వారు ఎప్పుడూ అభద్రతా భావంలోనే ఉంటారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరులను తక్కువగా చూస్తారు. ఈ ప్రవర్తన వల్ల వీరు బంధువులకు కూడా దూరమవుతాయి.