Walking: వాకింగ్ చేస్తూ బరువు తగ్గాలా? ఇవి కూడా చేయండి
బరువు తగ్గాలని రోజూ వాకింగ్ చేస్తున్నారా? అయితే వాకింగ్ తో పాటు.. మరికొన్ని ఫాలో అయితేనే బరువు తగ్గుతారు.

బరువు తగ్గాలని చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే.. ఎవరైనా సులభంగా చేయగల వ్యాయామం ఏదైనా ఉంది అంటే అది నడక మాత్రమే. ప్రతిరోజూ నడవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే.. మీరు బరువు తగ్గాలని రోజూ వాకింగ్ చేస్తున్నా కూడా బరువు మాత్రం తగ్గడం లేదని ఫీలౌతున్నారా? అయితే.. కేవలం నడవడంతో పాటు.. కొన్ని ట్రిక్స్ ఫాలో అయితేనే బరువు తగ్గుతాం. మరి, అవేంటో చూసేద్దామా...

బరువు తగ్గాలి అంటే ప్రతి ఒక్కరూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయాలి. ఈ 30 నిమిషాలు ఒకేసారి నడవడం కష్టం అనుకుంటే.. ఉదయం కాసేపు, సాయంత్రం కాసేపు నడవచ్చు. నడక మొదలు పెట్టిన కొత్తలో 30 నిమిషాలు నడవాలి. మొదట్లో 15 నిమిషాలు ఉదయం, 15 నిమిషాలు సాయంత్రం నడవండి. తర్వాత దానిని పెంచుకోవచ్చు.

కేవలం నడక వల్ల బరువు తగ్గడం సాధ్యం కాదు. ఆహారంలో మార్పులు కూడా చేసుకోవాలి. ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారం తినండి. దీనివల్ల కండరాలు బలంగా ఉంటాయి, కడుపు నిండుగా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
చాలా నీరు తాగడం చర్మ ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ 3 లీటర్ల నీరు తాగండి. లేదంటే కనీసం 8 గ్లాసుల వాటర్ అయినా తీసుకోవాలి.

కేవలం నడవడమే కాకుండా.. బరువులు మోయడం వల్ల కూడా బరువు తగ్గుతారు. బరువులు మోయడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇంట్లో బరువులు లేకపోతే సీసాలు వాడండి. రాత్రి 7 గంటలలోపు తినడం మంచిది. ఆ తర్వాత ఏమీ తినకుండా మరుసటి రోజు ఉదయం వరకు ఉపవాసం ఉండటం మంచిది. ఇంట్లో చేయగలిగే వ్యాయామాలు చేయండి. దీని కోసం మీరు ఇతర విషయాలపై కూడా శ్రద్ధ పెట్టాలి.

