పుల్లటి త్రేన్పులతో ఇబ్బంది పడుతున్నారా? చిటికెలో పరిష్కారం
చాలా మంది పుల్లని త్రేన్పులతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు కేవలం పది నిమిషాల్లో ఓ చిన్ని చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. అవేంటో చూద్దాం....

భోజనం చేసిన తర్వాత త్రేన్పులు రావడం చాలా సహజం. కానీ.. కొందరికి తేన్పులు వచ్చినప్పుడు ఒక రకమైన వాసన వస్తుంది. అది పక్కన ఉన్నవారికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాటినే పుల్లటి త్రేన్పులు అంటారు. పక్క వారికి ఇబ్బంది కలిగించడమే కాదు.. వారికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఛాతిలో, గొంతులో మంట కలిగిస్తుంది.
ఈ త్రేన్పులు దుర్వాసన రావడానికి కారణం ఆక్సీజన్, కార్బన్ డయాక్సైడ్ ను బయటకు పంపడం. ఇవి రెండూ ప్రాసెస్ చేసిన ఆహారాలు, పాల ఉత్పత్తులతో చర్య జరిపి దుర్వాసనతో కూడిన త్రేన్పులను బయటకు పంపుతాయి. ఇవి మాత్రమే కాదు ఇతర కారణాలు కూడా దీని వెనక ఉండి ఉండొచ్చు.
పుల్లటి త్రేన్పులకు కారణాలు:
- రాత్రి ఆలస్యంగా తినడం, ఎక్కువగా తినడం, త్వరగా తినడం, ఊబకాయం, ముఖ్యంగా తిన్న వెంటనే పడుకోవడం.
- ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమాటా, పుదీనా, చాక్లెట్, కారంగా , కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల కూడా జరగొచ్చు
- కాఫీ, టీ లేదా కార్బొనేటెడ్ పానీయాలు తాగడం వల్ల.
- సిగరెట్ , ఆల్కహాల్ తాగడం వల్ల..
- అధికంగా నూనె పదార్థాలు తినడం
పుల్లటి త్రేన్పుల లక్షణాలు:
- కడుపులో మంట అన్నవాహిక, మెడ , ఛాతీ వరకు వ్యాపించి నొప్పిని కలిగిస్తుంది.
- ఆ తర్వాత నోటిలో చేదు లేదా పుల్లని రుచిని కలిగిస్తుంది.
- తిన్న ఆహారం లేదా తాగిన ద్రవాలు తిరిగి కడుపు నుండి నోటికి వస్తాయి.
- చాలా రోజులు ఉండే దగ్గు
- వాంతులు లేదా వికారం వస్తుంది.
పుల్లటి త్రేనుపులను తగ్గించడానికి ఇంటి చిట్కాలు:
1. తిన్న తర్వాత ఒక చెంచా జీలకర్రను బాగా నమిలి తినండి, దీని వల్ల జీర్ణక్రియ ప్రేరేపించబడి ఎలాంటి సమస్యలూ రావు.
2. ఒక చెంచా ఓమాన్ని ఒక గ్లాసు నీటిలో బాగా మరిగించి వడగట్టి తాగితే గుండెల్లో మంట ఉండదు.
3. చిటికెడు ఇంగువను వేడి నీటిలో కలిపి తాగితే అసిడిటీ సమస్య రాదు.
4. తిన్న తర్వాత పుల్లటి త్రేనుపులు, గ్యాస్ సమస్య ఉంటే పుదీనా టీ తాగండి, ఇది గుండెల్లో మంట , ఆమ్లతను తగ్గిస్తుంది. పుల్లటి త్రేనుపులు , నోటి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
5. తిన్న వెంటనే పుల్లటి త్రేన్పులు వస్తే జీలకర్ర నీరు తాగండి. జీలకర్ర జీర్ణక్రియకు చాలా మంచిది కాబట్టి ఒక చెంచా జీలకర్రను 1 గ్లాసు నీటిలో వేసి మరిగించి తాగండి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా గ్యాస్, ఆమ్లత, పుల్లటి త్రేన్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
6. అల్లం కడుపుకు చాలా మంచిది. పుల్లటి త్రేన్పుల సమస్య ఉంటే అల్లం బాగా నమిలి తినండి. అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్, అలెర్జీ నిరోధక లక్షణాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అల్లం రసం తాగితే ఆమ్లత, గ్యాస్, పుల్లటి త్రేనుపులు వంటి సమస్యలు తగ్గుతాయి.