ఇది పెడితే.. తెల్ల జుట్టు తొందరగా నల్లగా అవుతుంది
ఈ రోజుల్లో తెల్ల జుట్టు కామన్ అయిపోయింది. కానీ తెల్ల జుట్టు వల్ల చిన్న వయసు వారు కూడా పెద్ద వారిలా కనిపిస్తారు. అందుకే చాలా మంది తెల్ల జుట్టు కనిపించకుండా కలర్ ను వేస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలతో తెల్ల జుట్టు మొత్తమే రాకుండా చేయొచ్చు. అదెలాగంటే?
ఒకప్పుడైతే తెల్ల వెంట్రుకలు పెద్దవయసు వారికి మాత్రమే వచ్చేవి. ఇప్పుడు పిల్లలకు, యువతలకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. కానీ దీనివల్ల పెద్దవారిలా కనిపించడమే కాకుండా.. జుట్టు అందం తగ్గుతుంది. అందుకే చాలా మంది ఈ తెల్ల వెంట్రుకలను దాచేయడానికి నల్ల కలర్లను వాడుతున్నారు.
కానీ కెమికల్ కలర్స్ ను వాడటం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. అందుకే మీరు ఈ డైకి బదులుగా నేచురల్ హెయిర్ మాస్క్ ను ట్రై చేయండి. ఇది మీ జుట్టును నేచురల్ గా నల్లగా చేస్తుంది. అందులోనూ ఇది మన జుట్టుకు కానీ, నెత్తికి కానీ ఎలాంటి హాని చేయదు. అలాగే ఈ మాస్క్ ను ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కలోంజి, భృంగరాజ్ హెయిర్ మాస్క్
కావాల్సిన పదార్థాలు:
కలోంజి పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు
భృంగరాజ్ పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు
పెరుగు - 2 టీస్పూన్లు
కొబ్బరి నూనె - 1 టీ స్పూను
నీళ్లు
హెయిర్ మాస్క్ ను ఎలా తయారు చేయాలి?
నల్లని జుట్టుకోసం హెయిర్ మాస్క్ ను తయారుచేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో కలోంజి, భృంగరాజ్ పౌడర్ ను వేయండి. దీంట్లోనే పెరుగు, అవసరమైనన్ని నీళ్లు పోసి బాగా కలపండి. దీన్ని పేస్ట్ లా చేయండి.
హెయిర్ మాస్క్ జుట్టుకు ఎలా పెట్టుకోవాలి?
మీరు తయారుచేసుకున్న పేస్ట్ ను బ్రష్ తో జుట్టుకు అప్లై చేయండి. ఆ తర్వాత కాసేపు మసాజ్ చేయండి. దీన్ని జుట్టుకు ఒక 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయండి. ఈ హెయిర్ మాస్క్ వల్ల తెల్ల జుట్టు నల్లగా అవుతుంది.
జుట్టుకు కలోంజి, భృంగరాజ్ ప్రయోజనాలు
కలోంజి, భృంగరాజ్ లను కలిపి వాడితే మీ జుట్టు నల్లగా ఉంటుంది. తెల్ల వెంట్రుకలు రావడం ఆగిపోతుంది. అలాగే మీ జుట్టు పొడుగ్గా పెరగడం మొదలవుతుంది. అంతేకాదు ఇది మీ జుట్టు రాలకుండా కూడా కాపాడుతుంది. మీ జుట్టు పెరగడం ఆగిపోతే గనుక కలోంజి నూనెను జుట్టుకు పెట్టి మసాజ్ చేయండి.
మీ జుట్టు షైనీగా ఉండాలంటే కొబ్బరినూనెతో భృంగరాజ్ ను అప్లై చేయండి. దీనివల్ల మీ జుట్టు స్మూత్ గా అవుతుంది. అయితే జుట్టుకు ఏదైనా పెట్టే ముందు ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోండి. అలాగే మర్చిపోకుండా ప్యాచ్ టెస్ట్ చేయండి.