- Home
- Life
- Dry Skin Home Remedies: డ్రై స్కిన్.. సాఫ్ట్ గా మారాలంటే ఈ 5 ఫేస్ ప్యాక్ లను ట్రై చేయండి..
Dry Skin Home Remedies: డ్రై స్కిన్.. సాఫ్ట్ గా మారాలంటే ఈ 5 ఫేస్ ప్యాక్ లను ట్రై చేయండి..
Dry Skin Home Remedies: కొంతమంది ఆయిలీ స్కిన్ తో బాధపడితే.. మరికొంతమంది మాత్రం డ్రై స్కిన్ తో బాధపడుతుంటారు. అయితే కొన్ని హోం రెమిడీతో డ్రై స్కిన్ ను వదిలించుకోవచ్చు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
డ్రై స్కిన్ నుంచి ఉపశమనం పొందాలంటే వీలైనన్ని ఎక్కువ నీటిని తాగుతూ ఉండాలి. అలాగే నీటి కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లను కూడా మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి. ఇవే కాకుండా పొడి చర్మాన్ని వదిలించుకోవడానికి కొన్ని ఫేస్ ప్యాక్ లు బాగా ఉపయోగపడతాయి. వీటిని ఫేస్ కు పెట్టడం ద్వారా ముఖం ప్రకాశవంతంగానే కాదు తేమగా కూడా ఉటుంది. మరి ఆ ఫేస్ ప్యాక్ లను ఎలా తయారుచేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
ఓట్స్, తేనె, పెరుగు, బొప్పాయి, శెనగపిండి, ఆరెంజ్ జ్యూస్ మొదలైన వాటితో ఫేస్ ప్యాక్ లను తయారుచేసుకుని పెట్టుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. వీటిని రోజులో ఎప్పుడన్నా ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ లను ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
శెనగపిండి, పెరుగు ఫేస్ ప్యాక్.. ఒక గిన్నెను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండి, ఒక టేబుల్ స్పూన్ పెరుగును వేసి పేస్ట్ లా తయారుచేసుకోండి. ఈ పేస్ట్ ను ముఖానికి, మెడకు బాగా పట్టించండి. అది పూర్తిగా ఆరిన తర్వాత కొద్దిగా నీళ్లను జల్లి .. నెమ్మదిగా మసాజ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేయండి. ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్లతో ముఖాన్ని కడగండి.
ఓట్స్.. తేనె ఫేస్ ప్యాక్.. మిక్సింగ్ బౌల్ లో ఒక టేబుల్ స్పూన్ చూర్ణం చేసిన ఓట్స్ ను తీసుకోండి. దాంట్లో అరటేబుల్ స్పూన్ తేనెను కలపండి. దీన్ని పేస్ట్ లా తయారుచేసుకుని ముఖానికి, మెడకు పట్టించండి. 20 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేసి.. ఆ తర్వాత నీట్ గా కడిగేయండి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే డ్రైనెస్ పోతుంది.
ఆరెంజ్ జ్యూస్, ఓట్స్ ఫేస్ ప్యాక్.. ఒక గిన్నెలో అరకప్పు తాజా నారింజ రసం తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ ను కలపండి. ఈ మిశ్రమాన్ని కాసేపు నానబెట్టి ముఖానికి, మెడకు పట్టించండి. దీన్ని 20 నిమిషాలు అలాగే ఉండనిచ్చి ఆ తర్వాత నార్మల్ వాటర్ తో కడిగి.. ఆ తర్వాత మీరు వాడే మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి.
కలబంద, దోసకాయల ఫేస్ ప్యాక్.. ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్ ను తీసుకుని అందులో తురిమిన దోసకాయను కలపండి. దీన్ని ముఖానికి, మెడకు పెట్టండి. 30 నిమిషాల పాటు అలాగే వదిలేసి.. ఆ తర్వాత చల్లని నీళ్లతో కడిగేయండి.
బొప్పాయి ఫేస్ ప్యాక్.. మంచిగా పండిన బొప్పాయి పండు నుంచి రెండు చిన్న క్యూబ్స్ ను తీసుకుని గుజ్జుగా చేయండి. దానిలో ఒక టీస్పూన్ తేనెను కలపండి. ఈ పేస్ట్ ను ముఖం, మెడ భాగానికి అప్లై చేయండి. దీన్ని 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత నీట్ గా కడిగేయండి.