ఫ్రిజ్ లో ఏ పండ్లను పెట్టకూడదు?
dont keep these fruits in the refrigerator: ఫ్రిజ్ లో మిగిలిపోయిన అన్నం, కూరలు, చపాతీలతో పాటుగా కూరగాయలను, పండ్లను పెడుతుంటాం. కానీ కొన్ని రకాల పండ్లను ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే?

fridge
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఖచ్చితంగా ఉంటుంది. అన్ని వస్తువులతో పాటుగా ఫ్రిజ్ కూడా నిత్యవసర వస్తువుగా మారింది. ఎందుకంటే ఫ్రిజ్ లో ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ చేయొచ్చు. పాడవకుండా కాపాడొచ్చు. అందుకే చాలా మంది మిగిలిపోయిన ఫుడ్ ను, కూరగాయలను, మసలా దినుసులతో పాటుగా పండ్లను, పాలను కూడా పెట్టేస్తుంటారు. నిజం చెప్పాలంటే ఫ్రిజ్ లో పెడితే ఆహార పదార్థాలు ఎక్కువ సేపు నిల్వ ఉంటాయి. కానీ అన్ని రకాల ఆహారాలను ఫ్రిజ్ లో పెట్టడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది వారానికి సరిపడా పండ్లను ఒకేసారి కొనేసి పాడవకుండా, మురిగిపోకుండా ఉండటానికి ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. పండ్లను ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయనేది నిజం. కానీ కొన్ని రకాల పండ్లను ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఎందుకంటే వాటి టేస్ట్ మారుతుంది. అలాగే పోషకాలు కూడా తగ్గుతాయి.
mangoes
ఫ్రిజ్ లో ఏ పండ్లను పెట్టకూడదు?
మామిడి
ఎండాకాలంలో మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. ఇంకేముంది ఎక్కడ మంచి మంచి మామిడి పండ్లు కనిపించినా కొనేసి ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. తినాలనిపించినప్పుడు తింటుంటారు. కానీ మామిడి పండ్లను ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఈ పండ్లను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అవి మరింత పండుతాయి. దీంతో మామిడి పండ్లపై నల్ల మచ్చలు ఏర్పడతాయి.
టమాటాలు
చాలా మంది టమాటాలను ఎక్కువగా కొనేసి పాడవకుండా ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కానీ టమాటాలను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అవి ఎండిపోతాయి. వాటిలో వాటర్ కంటెంట్ తగ్గుతుంది. దీంతో టమాటాల రుచి తగ్గుతుంది. అలాగే అవి తాజాగా అనిపించవు.
పుచ్చకాయ
పుచ్చకాయలను కూడా ఫ్రిజ్ లో పెట్టేసి తినే వారున్నారు. చాలా మంది పుచ్చకాయను కొసి ఫ్రిజ్ పెట్టి చల్లచల్లగా తింటుంటారు. కానీ ఇలా ఫ్రిజ్ లో పెడితే ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గుతాయి. పోషకాలు కూడా తగ్గిపోతాయి. అందుకే కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టకూడదంటారు.
అరటిపండ్లు
అరటపండ్లు తొందరగా పాడవుతాయని చాలా మంది వీటిని ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కానీ అరటిపండ్లను ఫ్రిజ్ లో మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే అరటిపండ్లను ఫ్రిజ్ లో పెడితే వాటి చర్మం నల్లగా అవుతుంది. అలాగే వాటి రుచి మారుతుంది. వాటిలోని పోషకాలు కూడా తగ్గుతాయి.
ఆపిల్ పండు
ఆపిల్ పండ్లను కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఎందుకంటే ఆపిల్ పండ్లను ఫ్రిజ్ లో పెడితే అవి మరింత పిండిగా తయారవుతాయి. అలాగే ఫ్రిజ్లో ఉన్న ఇతర ఆహారాల వాసనలను ఆపిల్ రుచిని మారుస్తాయి. అందుకే ఈ పండ్లను ఫ్రిజ్ లో పెట్టకూడదంటారు.
కీరదోసకాయ
కీరదోసకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ వీటిని మాత్రం ఫ్రిజ్ లో పెట్టకూడదు. దీనివల్ల వీటిలో హైడ్రేట్ కంటెంట్ పెరుగుతుంది. అలాగే కీరదోసకాయల చర్మంపై నల్ల మచ్చలు ఏర్పడతాయి.
సిట్రస్ పండ్లు
నిమ్మకాయ, నారింజ వంటి సిట్రస్ పండ్లను ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఫ్రిజ్ చల్లదనం పండ్ల సిట్రస్ ఆమ్లాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే వాటి రుచి కూడా మారుతుంది.