- Home
- Life
- weight loss: బెల్లీఫ్యాట్ ను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఈ తప్పులు చేస్తే మాత్రం అస్సలు తగ్గరు చూడండి.
weight loss: బెల్లీఫ్యాట్ ను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఈ తప్పులు చేస్తే మాత్రం అస్సలు తగ్గరు చూడండి.
weight loss: అధిక బరువు, ఊబకాయుల్లో బెల్లీ ఫ్యాట్ అనేది అత్యంత సాధారణ సమస్య. అయితే మీరు గనుక ఈ బెల్లీఫ్యాట్ ను వదిలించుకునే ప్రయత్నంలో ఉంటే మాత్రం ఈ మిస్టేక్స్ ను అస్సలు చేయకండి.. చేశారో.. మీరు ఎంత ప్రయత్నించినా బెల్లీ ఫ్యాట్ తగ్గదు జాగ్రత్త..

belly fat
weight loss: ప్రస్తుత కాలంలో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇక ఈ సమస్య ఉన్నవారికి ఖచ్చితంగా పొట్ట దగ్గర కొవ్వు విపరీతంగా పేరుకుపోతుంది. ఈ కొవ్వు మహిళలకు తుంటి భాగంలో పేరుకుపోతే.. పురుషులకు మాత్రం పొత్తికడుపు భాగంలో పేరుకుపోతుంది. నిజానికి ఇతర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వుకంటే పొత్తికడుపు దగ్గర పోరుకుపోయిన కొవ్వు ఎక్కువ ప్రమాదరకమైంది. దీన్ని విసెరల్ ఫ్యాట్ అనికూడా పిలుస్తారు. ఈ ఫ్యాట్ వల్ల గుండె సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ ను కరిగించేందుకు చాలా మంది ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రాసెస్ లో చాలా మంది తమకు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ ను చేస్తుంటారు. దాంతో వారు ఏమాత్రం కొవ్వులను కరిగించలేరు. ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టార్గెట్ వెయిట్ లాస్.. టార్గెట్ వెయిట్ లాస్ అనేది పూర్తిగా అపోహ మాత్రమే. ఎందుకంటే మీరు నిర్ధిష్ట భాగంలో బరువు తగ్గాలని ప్రయత్నించినప్పటికీ .. అది మీ శరీరంలో ఏ భాగంలో అయినా బరువు కోల్పోవచ్చు. కానీ ఏ భాగం నుంచి బరువు తగ్గిందనేది మాత్రం చెప్పడం కష్టం. తొడలు, పొట్ట తగ్గాలనుకుని మీరు వ్యాయామాలు చేసినప్పటికీ.. మొదటగా ఆ ప్రాంతాల్లోనే బరువు కోల్పోతుంది అనేది చెప్పడం కష్టమే. కాబట్టి బరువు తగ్గాలనుకుని వ్యాయామాలు చేసేవారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. పొట్ట తగ్గడం లేదే అని నిరాశ చెందకుండా ప్రతిరోజూ వ్యయామాలను చేయండి. మీరు ఆశించిన ఫలితం తొందరలో లభిస్తుంది.
పొట్ట మాడ్చుకోవద్దు.. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఇదే. పొట్టను మాడ్చడం వల్ల కిలోలకు కిలోలు బరువు తగ్గుతామని ఆకలితో అలమటిస్తుంటారు. నిజానికి ఇలా చేయడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. దీంతో మీరు బలహీనంగా తయారవుతారు. అంతేకాదు మీ పొట్టదగ్గర మరింత కొవ్వు పేరుకుపోవడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చు. ఎందుకంటే శరీరం పనిచేయడానికి అవసరమైన పోషకాలు లభించినప్పుడే కొవ్వులు కరుగుతాయి. కానీ కడుపు మాడ్చుకుని కూర్చుంటే మాత్రం మీ పొట్ట కొవ్వు ఏ మాత్రం కరగదు. సకాలంలో మంచి పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరం.
చెడు అలవాట్లు.. బరువు తగ్గే ప్రాసెస్ లో మంచి పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. చెడు అలవాట్లకు అంత దూరంగా ఉండటం కూడా ముఖ్యమే. పరిమితికి మించి తినడం.. వ్యాయామం చేయకపోవడవం వంటి అలవాట్ల వల్ల మీరు మరింత బరువు పెరుగుతారు తప్ప తగ్గరు. పరిమితిగా తింటూ .. రోజుకు వన్ హవర్ శారీరక శ్రమ చేస్తే మంచి ఫలితాలొస్తాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆల్కహాల్, స్మోకింగ్, అధిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు బరువు తగ్గే ప్రాసెస్ ను స్లో చేస్తాయి.
చురుకైన కదలికలు.. తొందరగా బరువు తగ్గాలంటే రోజుకు గంట వ్యాయామం చేస్తే సరిపోదు.. రోజంతా మీరు చురుగ్గా ఉండాలి. అంటే గంటల కొద్దీ కదలకుండా కూర్చోవద్దు అన్న మాట. అలా కూర్చుంటే మీరు బరువు తగ్గే ప్రాసెస్ ఆగిపోయినట్టే. అందుకే గంటకు లేదా పావుగంటకోసారి నడుస్తూ ఉండాలి. వర్క్ చేస్తున్నా.. టీవీ చూస్తున్నా..మధ్య మధ్యలో లేచి నడుస్తూ ఉండండి. అప్పుడే మీ బెల్లీ ఫ్యాట్ తొందరగా కరుగుతుంది.
తగినన్ని నీళ్లు.. బరువు తగ్గడానికి నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. రోజుకు శరీరానికి కావాల్సిన నీళ్లను తాగినప్పుడే మీరు చాలా సులువుగా బరువు కోల్పోతారు. నీళ్లను తక్కువగా తాగితేనే మీరు ఫుడ్ ను ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల మీ శరీరంలో కేలరీలు ఎక్కువగా పేరుకుపోతాయి. దీంతో వెయిట్ చాలా పెరుగుతారు. కాబట్టి రోజులో ఎక్కువ నీళ్లు తాగడానికి ప్రయత్నించండి.