పెంపుడు కుక్కలకు పొరపాటున కూడా ఈ ఫుడ్స్ ను పెట్టకండి..
మనకు ఆరోగ్యకరమైన ఆహారాలు.. కుక్కలకు ఆరోగ్యకరమైనవి కాకపోవచ్చు. అందుకే మనం తినే కొన్ని రకాల ఆహారాలను పెంపుడు కుక్కలకు అసలే పెట్టకూడదు.

pet dog
కుక్కలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే నచ్చిన బిజ్జి కుక్క పిల్లలను తెచ్చుకుని పెంచుకుంటారు. అయితే ఇంట్లో కుక్కలను పెంచుకునే వారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో.. ఎందుకంటే మనం తినే వాటిని కూడా కుక్కలకు పెడుతుంటాం. అయితే మనకు ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలు.. కుక్కలకు హాని కలిగించొచ్చు. మనల్ని ఆరోగ్యంగా ఉంచే.. కుక్కలకు హానిచేసే ఈ ఆహారాలను కుక్కలకు మాత్రం పెట్టకండి.
చాక్లెట్
చాక్లెట్ ను ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరేమో. ఇక మనం తిందామని తెచ్చుకున్న చాక్లెట్లను కుక్కలకు కూడా పెట్టేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇది వారి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. కుక్కలు చాక్లెట్లను తింటే వాంతులు, డీహైడ్రేషన్, వణులకు వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకు కుక్కలకు చాక్లెట్లను తినిపించకూడదు.
ఉప్పుగా ఉండే వస్తువులు
ఉప్పు మనుషులకే కాదు కుక్కలకు కూడా హాని చేస్తుంది. సోడియం కుక్కలను డీహైడ్రేషన్ బారిన పడేస్తుంది. ఎందుకంటే ఉప్పుగా ఉండే ఆహారాలను పెట్టడం వల్ల కుక్కలు తరచుగా మూత్రవిసర్జన చేస్తాయి. కుక్కలకు ఎక్కువ ఉప్పు తినిపించడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగడంతో పాటుగా, మూర్ఛ కూడా వస్తుంది.
వెల్లుల్లి, ఉల్లిపాయలు
ఉల్లి, వెల్లుల్లిలో ఎన్నో పోషకాలుంటాయి. అవి మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ కుక్కలకు కాదు. వీటిని కుక్కలకు తినిపించడం వల్ల ఎర్ర రక్త కణాలకు నష్టం కలుగుతుంది. ఈ కారణంగా మీ కుక్కకు రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది.
బేకన్, లీన్ మీట్
కుక్కలకు బేకన్ లేదా లీన్ మీట్ ను అసలే తినిపించకూడదు. ఎందుకంటే ఇది క్లోమం వాపుకు దారితీస్తుంది. కుక్కకు మాంసాన్ని ఎలా తినిపించాలనే దానిపై నిపుణుల సలహా తీసుకోండి. ఆవిధంగానే మీ కుక్కకు ఆహారాన్ని పెట్టండి. అప్పుడే మీ పెట్ డాగ్ ఆరోగ్యంగా ఉంటుంది.