BeautyTips: కెమికల్ హెయిర్ కండిషనర్ తో విసిగిపోయారా.. అయితే అరటి పండుతో నాచురల్ ఎయిర్ కండిషనర్ బెస్ట్ రెమిడీ!
Beauty Tips: ఇప్పుడు హెయిర్ కండిషనర్ వాడటం సర్వసాధారణం అయిపోయింది. అయితే దీనిలో ఉండే రసాయనాలు జుట్టుని మెల్ల మెల్లగా దెబ్బతీస్తుంది. అందుకే ఇంట్లోనే అరటి పండుతో సహజసిద్ధమైన హెయిర్ కండిషనర్ చేసుకుందాం.
జుట్టు కోసం అరటిపండుని ఉపయోగించటం అనేది ఎప్పటినుంచో భారత దేశంలో జరుగుతున్నది. అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, ప్రోటీన్లు, బి 6, విటమిన్ సి మరియు డైటరీ, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ మన జుట్టుకి శక్తిగా పరిగణించబడతాయి. అదనంగా అరటిపండు సిలికాన్ ను కలిగి ఉంటుంది.
ఇది మన శరీరం కొల్లాజెన్ లు ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. అందుకే బయట హెయిర్ కండిషనర్ మీ తలని మరింత పొడిబారినట్లు చేసినట్లయితే అప్పుడు సహజంగా అరటి పండుతో ఇంట్లోనే హెయిర్ కండిషనర్ చేద్దాం.
దానికి కావలసిన పదార్థాలు రెండు అరటి పండ్లు, రెండు టేబుల్ స్పూన్ల తేనె, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరిపాలు, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె, కొన్ని రోజు వాటర్ చుక్కలు. ఇప్పుడు అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో కొబ్బరి పాలు, తేనే కలపండి.
తర్వాత కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ కూడా కలపండి. దీనిని చేత్తో మెదుపుతూ చిక్కని పేస్టులాగా తయారు చేయండి. సువాసన కోసం కొన్ని చుక్కల రోజు వాటర్ ని కూడా ఉపయోగించవచ్చు. మీకు కావాలనుకుంటే ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని కూడా కలపవచ్చు.
ఇప్పుడు సహజమైన బనానా హెయిర్ కండిషనర్ రెడీ అయింది. దీనిని చిక్కులు లేకుండా తీసి పెట్టుకున్న జుట్టుని కొద్దిగా తడిచేసి ఆపై ఈ కండిషనర్ ని కుదురుల నుంచి చివర్ల వరకు రాయండి. ఆ తర్వాత 30 నిమిషాల పాటు షవర్ క్యాప్ ధరించండి. ఆ తర్వాత నీటితో కడిగేయండి.
తరచుగా ఇలా చేయటం వలన మీ జుట్టులో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు. ఈ మిశ్రమంలో కలపబడిన తేనే జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కొబ్బరిపాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు కొవ్వులు జుట్టును బలంగా మరియు మందంగా ఉండేలాగా చేస్తాయి.