- Home
- Life
- Diabetes: డయాబెటీస్ పేషెంట్లు ఈ డ్రై ఫ్రూట్స్ ను అస్సలు తినకూడదు.. తిన్నారో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి జాగ్రత్త
Diabetes: డయాబెటీస్ పేషెంట్లు ఈ డ్రై ఫ్రూట్స్ ను అస్సలు తినకూడదు.. తిన్నారో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి జాగ్రత్త
Diabetes: డయాబెటీస్ పేషెంట్లు తినే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉది. అవేంటంటే..

Diabetes: మన దేశంలో రోజు రోజుకు డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని సర్వేలు చెబుతున్నాయి.మధుమేహులు తీసుకునే ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వారి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది.
మన ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలిసిందే. అయితే డయాబెటీస్ పేషెంట్లు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వీటిని తింటే వారి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదముంది. మరి మధుమేహులు ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఖర్జూరాలు.. ఖర్జూరా పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే మధుమేహుల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. కాబట్టి ఖర్జూరా పండ్లను మధుమేహులు తినకూడదు.
ఎండుద్రాక్ష.. ఎండుద్రాక్షలో గ్లూకోజ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని తింటే శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి మధుమేహులు ఎండుద్రాక్షలను అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వీటిని కూడా తినకండి..
వైట్ బ్రెడ్.. డయాబెటీస్ పేషెంట్లు తీసుకునే ఆహారం మరియు కొన్ని రకాల పానీయాల పట్ల ఎంతో శ్రద్ధగా ఉండాలి. ముఖ్యంగా వీరు పిండి పదార్థం ఎక్కువ మొత్తంలో ఉండే ఆహార పదర్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. మధుమేహులుు వైట్ బ్రెడ్ ను అస్సలు తినకూడదు. దీన్ని తింటే వీరి షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
సపోటా.. మధుమేహులు సపోటా పండ్లను అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ పండ్లు తియ్యగా ఉండటంతో పాటుగా గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ పేషెంట్లు ఈ పండ్లను అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బంగాళాదుంప.. షుగర్ పేషెంట్లు బంగాళాదుంపలను చాలా తక్కువ మొత్తంలో తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వీటిని మోతాదుకు మించి తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయే ప్రమాదం ఉంది. వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఉంటుంది. వీటివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి షుగర్ పేషెంట్లు బంగాళాదుంపలను ఎక్కువగా తినకూడదు.