MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Diabetes patients: డయాబెటీస్ పేషెంట్లు పొరపాటున కూడా ఈ కూరగాయలను తినకూడదు..

Diabetes patients: డయాబెటీస్ పేషెంట్లు పొరపాటున కూడా ఈ కూరగాయలను తినకూడదు..

Diabetes patients: మధుమేహులకు ఆకు పచ్చని కూరగాయలు ఎంతో మంచివి. ఇవి తింటే వారి రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అయితే వీరు కొన్ని రకాల కూరగాయలను మాత్రం పొరపాటున కూడా తీసుకోవద్దు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 26 2022, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ రోజుల్లో డయాబెటీస్ వ్యాధి సర్వసాధారణంగా మారిపోయింది. అందులోనూ ఇది చిన్న వయసు వారికి కూడా వస్తుంది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. మారిన జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. ఒక్కసారి వచ్చిందంటే ఇది అంత సులువుగా వదిలిపోదు. జీవితాంతం మనల్ని అంటుకునే ఉంటుంది. 

26

అందుకే వీరు తమ రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లు కొన్ని రకాల కూరగాయలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వాటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఇంతకి ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం పదండి. 

36

బంగాళాదుంప (Potato): కూరగాయల్లో రారాజుగా బంగాళాదుంపలను పిలుస్తారు. ఎందుకంటే ఈ బంగాళాదుంపలను ఎన్నో రకాల కూరగాయలతో కలిపి వండుతారు. దీన్ని ఏ కూరగాయలతో కలిపి చేసినా.. టేస్ట్ అదిరిపోతుంది. కానీ ఇది డయాబెటీస్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే దీనిలో కార్బోహైడ్రేట్లు (Carbohydrates), పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచడానికి సహాయపడతాయి. అందుకే బంగాళా దుంపలతో చేసిన చిప్స్, బంగాళా దుంప టిక్కి, ఫ్రెంచ్ ఫ్రైట్ వంటివి ఏవీ తినకూడదు. 
 

46

మొక్కజొన్న (Corn): మొక్కజొన్నలను సన్నని మంటపై కాల్చుకుని లేదా ఉడకబెట్టుకుని తింటుంటే వచ్చే మజాయే వేరు. దీనిని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరేమో. కానీ దీనిని మధుమేహులు మాత్రం అస్సలు తినకూడదు. ఎందుకంటే దీనిలో కార్బోహైడ్రేట్ల కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది వారి రక్తంలో షుగర్ లెవెల్స్ ను విపరీతంగా పెంచుతుంది. 
 

56

చిలగడదుంప (Sweet potato): చిలగడదుంపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచుగా తినడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గుతాయి. అయితే ఇవి మధుమేహులకు ఏ మాత్రం మంచివి కావు. ఎందుకంటే వీటిలో బీటా కెరోటిన్, కార్బోహైడ్రెట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి. అందులోనూ దీనిలో షుగర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే మధుమేహులు వీటిని తినకపోవడమే మంచిది. 

66

బఠాణీ (Pea): బఠాణీలో మన ఆరోగ్యానికి మంచి చేసేవే అయినా.. వీటిని మధుమేహులు ఎట్టి పరిస్థితిలో తినకూడదు. వీటిలో పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి షుగర్ లెవెల్స్ ను విపరీతంగా పెంచుతాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు వీటిని తినకపోవడమే మంచిదని నిపుఉణులు చెబుతున్నారు. ఒక వేళ తింటే వీరి జీర్ణక్రియ మరింత క్షీణిస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice Water: బియ్యం నీటిలో వీటిని కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!
Recommended image2
Cooking Tips: వంటలో ఉప్పు ఎక్కువైందా? ఇలా చేస్తే రుచి ఇంకా అదిరిపోద్ది
Recommended image3
Curd: పెరుగు పులవకుండా తాజాగా ఉండాలా? ఇదొక్కటి వేస్తే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved