రాగి, ఇత్తడి కూడా బంగారంలా మెరవాలంటే ఏం చేయాలో తెలుసా?
మనం సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల రాగి, ఇత్తడి వస్తువులను కూడా బంగగారంలా మెరిసేలా చేయవచ్చు.
పండగ వస్తోంది అంటే చాలు.. ఇంటిని శుభ్రం చేయడంతో పనులు మొదలుపెడతాం. సంక్రాంతి లాంటి పెద్ద పండకు అయితే.. ఇంట్లోని అన్ని మూలలను శుభ్రం చేసుకుంటూ ఉంటారు. దానితోపాటు.. దేవుడికి పూజ చేసుకుంటాం కాబట్టి.. ఆ పూజ సామాగ్రి కూడా శుభ్రం చేస్తారు. అయితే... వెండి వస్తువులను శుభ్రం చేయవచ్చు కానీ.. ఈ రాగి, ఇత్తడి మాత్రం ఎంత రుద్దినా.. ఆ నలుపు పోదని.. పాత వాటిలా కనపడతాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ, మనం సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల రాగి, ఇత్తడి వస్తువులను కూడా బంగగారంలా మెరిసేలా చేయవచ్చు.
1.రాగి వస్తువులను ఎలా శుభ్రం చేయాలి..?
రాగి బిందెలను, పూజ వస్తువులను శుభ్రం చేయడానికి మీరు ఒక మ్యాజిక్ వాటర్ ఉపయోగించాలి. దీని సహాయంతో కొన్ని నిమిషాల్లో కాదు, కొన్ని సెకన్లలోనే మీరు బిందెలను శుభ్రం చేయవచ్చు. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు వేడి చేయండి. గోరువెచ్చగా కాకుండా వేడి చేయండి. అందులో రెండు చెంచాల వెనిగర్ కలపండి. వెనిగర్ లేకపోతే రెండు చెంచాల చక్కెరలా కనిపించే సిట్రిక్ యాసిడ్ వాడండి. ఇది ఏ దుకాణంలోనైనా దొరుకుతుంది. దానికి ఎక్కువ ఉప్పు కలపండి. అంతే, మేజికల్ వాటర్ రెడీ. రాగి బిందె ఎంత పాతదైనా, కొంతసేపు అందులో నానబెట్టండి. అది బంగారంలా మెరుస్తుంది.
ఇత్తడి బిందెలను ఎలా శుభ్రం చేయాలి?
రాగితో పాటు ఇత్తడి బిందెలకు కూడా ఆదరణ పెరుగుతోంది. మీరు కూడా పూజ కోసం ఇత్తడి బిందెలను, వస్తువులను ఉపయోగిస్తుంటే, వాటిని శుభ్రం చేయడం కష్టంగా ఉంటే, కొద్దిగా టమాటో కెచప్‌లో వెనిగర్, ఏదైనా డిటర్జెంట్ కలిపి మిశ్రమం తయారు చేసి, బిందెలకు పూసి 5 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత స్క్రబ్బర్‌తో రుద్దండి. అవి కూడా కొత్తవాటిలా మెరుస్తాయి. ఇలా కష్టపడకుండానే మీరు ఇత్తడి బిందెలను కూడా కొన్ని నిమిషాల్లో శుభ్రం చేయవచ్చు.