చాణక్యనీతి ప్రకారం.. ప్రేమించే ముందు ఇవి తెలుసుకుంటే మంచిదేమో!
ప్రస్తుత కాలంలో నిజమైన, నిస్వార్థమైన ప్రేమ దొరకడం చాలా కష్టం. ఎవరు, ఎప్పుడు, ఎవరిని, ఏలా మోసం చేస్తారో చెప్పలేని పరిస్థితి. మోసం చేసే వారికన్నా.. మోసపోయే వారి సంఖ్యే ఎక్కువ. అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రంతో ప్రేమలో మోసపోకుండా బయటపడవచ్చు.

సాధారణంగా ఆస్తి, వ్యాపారాల్లో మోసపోతే తిరిగి కోలుకునే అవకాశాలు ఎక్కువ. కానీ ప్రేమలో మోసపోతే కలిగే బాధ చెప్పలేము. మరీ ప్రేమలో మోసపోకుండా ఎలా జాగ్రత్తపడాలో.. ఆచార్య చాణక్య నీతిలో నాలుగు విషయాలు మీకోసం.
మోసం పెరిగిపోయింది
మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.. ప్రస్తుతం నిజమైన ప్రేమ దొరకడం చాలా కష్టం. పైగా ఈ డిజిటల్ యుగంలో మోసం చేయడం చాలా సులభమైపోయింది. అయితే ఆ మోసాలనుంచి తప్పించుకోవడానికి చాణక్య నీతి ఎంతగానో సహాయపడుతుంది.
జాగ్రత్త అవసరం
ప్రేమలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. చాణక్య నీతిలోని కొన్ని విషయాలు పాటించడం ద్వారా ప్రేమలో మోసపోకుండా ఉండొచ్చు.
వ్యక్తిత్వం ముఖ్యం
ప్రేమలో ప్రధానంగా భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. వ్యక్తిత్వాన్ని గుర్తించాలి. కనిపించేదానికన్నా చేసే పనులను జాగ్రత్తగా గమనించాలి.
తప్పులు గమనించాలి
ప్రేమలో ఉన్నప్పుడు మనసుతో ఆలోచించడం ముఖ్యం. తప్పులు గమనిస్తూ ఉండాలి. ఎదుటి వ్యక్తిపై అనుమానం వస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి.
సరైన నిర్ణయం..
ప్రేమలో ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం. నిజాన్ని ఎవరూ చెప్పిన అంగీకరించాలి. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి.
అప్రమత్తత అవసరం
ప్రేమలో ఉన్నప్పుడు అప్రమత్తత చాలా అవసరం. ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. తప్పులను అస్సలు క్షమించకూడదు.