- Home
- Life
- ఒంట్లో వేడి తగ్గుతుందని మజ్జిగను అతిగా తాగుతున్నారా? అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..
ఒంట్లో వేడి తగ్గుతుందని మజ్జిగను అతిగా తాగుతున్నారా? అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..
Buttermilk Side Effects: వేసవిలో మజ్జిగను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయని మనందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో మజ్జిగను తాగడం వల్ల చలువ చేయడమే కాదు వేసవి తాపం కూడా తీరుతుంది. అలా అని మోతాదుకు మించి మజ్జిగను తాగితే మాత్రం మీరు ఎన్నోఅనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

butter milk
Buttermilk Side Effects: ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది మజ్జిగను, పెరుగును ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేయడమే కాదు.. వేసవి తాపం కూడా తీరుతుంది. ఇందులో మజ్జిగను తాగడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. అందుకని మజ్జిగను ఇస్టంగా తాగే వారు చాలా మందే ఉన్నారు.
మజ్జిగ వల్ల ఎలా అయితే మంచి జరుగుతుందో.. చెడు కూడా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవును మజ్జిగను తాగడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ మనం మజ్జిగను మోతాదుకు మించి తాగితే ఏమౌతుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
butter milk
ఒక పప్పు మజ్జిగలో 98 కేలరీలు ఉంటాయి. అలాగే ప్రోటీన్లు, సోడియం, కాల్షియం, విటమిన్ బి12, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అయితే మజ్జిగను తీసుకోవడం వల్ల కొంతమంది అలెర్జీకి గురికావొచ్చు. దానికి కారణం ఉప్పు కంటెంట్ మజ్జిగలో ఎక్కువగా ఉండటమే.
కొవ్వులు తక్కువగా ఉండే మజ్జిగను మీరు తాగినప్పటికీ.. అందులో సోడియం కంటెంటె చాలా ఎక్కువగా ఉండటంతో అది మనపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
మజ్జిగను వీళ్లు తీసుకోకూడదు.. జ్వరం, జలుబు, అలెర్జీ సమస్యలతో బాధపడేవారు మజ్జిగను రాత్రిపూట తీసుకోకూడదు. ఇలాంటి సమస్యలున్న వారు మజ్జిగను తాగితే వారి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. దీన్ని తాగడం వల్ల ఈ సమస్యలు మరింత ఎక్కువయ్య ప్రమాదం ఉంది.
మజ్జిగను పిల్లలకు ఎట్టి పరిస్థితిలో తాగించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వెన్నలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా పిల్లలపై చెడు ప్రభావం చూపుతుంది. ఒకవేళ పిల్లలు మజ్జిగ తాగితే.. ఆ చెడు బ్యాక్టీరియా వల్ల పిల్లలు జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ సమస్య బారిన పడే అవకాశం ఉంది.
మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వారు మజ్జికకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో ఉండే సోడియం వారికి హానీ కలిగిస్తుంది.