Recipes: చల్లని సాయంత్రానికి చక్కనైన కాంబినేషన్.. రుచికరమైన బ్రోకలీ 65!
Recipes: 65 లో మనం చాలా రకాలు చూసి ఉంటాం. అయితే తిన్న వెరైటీ తినాలంటే నేటి యువతకి పెద్దగా నచ్చదు అందుకే వెరైటీగా ఈసారి రుచికరమైన బ్రోకలీ 65 తయారు చేద్దాం. అది ఎలా తయారు చేయాలో దానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం.
బ్రోకలీ అనేది గ్రీన్ కలర్ లో పుష్పగుచ్చం లాగా ఉంటుంది. ఇంచుమించు కాలీఫ్లవర్ ని పోలి ఉంటుంది. కలర్ మాత్రం గ్రీన్ అంతే. రుచి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే బ్రోకలీ 65 టేస్ట్ ని మనం కూడా ట్రై చేద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఒక బ్రోకలీ పువ్వు చిన్నది.
అలాగే అరకప్పు మైదా, పావు కప్పు మొక్కజొన్న పిండి, పావు కప్పు బియ్యం పిండి, ఒక స్పూన్ ఎర్ర మిరపపొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, ఉప్పు రుచికి తగినంత, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, పావుకప్పు నీరు, నూనె వేయించడానికి సరిపడినంత.
ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బ్రోకలీ ని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత కాస్త నీటిలో ఉప్పు వేసి ఈ బ్రోకలీ ముక్కలు కూడా అందులో వేసి రెండు నిమిషాల పాటు ఉడికించండి.
పూర్తిగా ఉడికించక్కర్లేదని గుర్తించండి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, గరం మసాలా, శనగపిండి, మిరప పొడి, ఉప్పు వేసి చాలా తక్కువ నీరు కలిపి ఒక థిక్ పేస్ట్ ని తయారు చేయండి
ఇప్పుడు ఆ పిండిలో కొంచెం కొంచెం గా ఉడికించుకున్న బ్రోకలీని వేయండి. ఆపై మిగిలిన మసాలాలను కూడా వేసి స్మూత్ గా పిండి మొత్తం కలిసేలాగా కలపండి. ఇప్పుడు కాగుతున్న నూనెలో వేసి వాటిని వేయించండి.
Gopi 65
బంగారు రంగు వచ్చేవరకు వేయించి తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇంకేముంది బ్రోకలీ 65 రెడీ. చల్లని సాయంత్రం వేళ టీ తో కానీ కాఫీ తో కానీ వీటిని స్నాక్స్ గా తీసుకుంటే మంచి అనుభూతి కలుగుతుంది.