శెనగపిండిని ఇలా పెడితే మీ అందం పెరుగుతుంది తెలుసా?
శెనగపిండి మొటిమలను తొలగిస్తుంది. అలాగే చర్మానికి మంచి రంగును కూడా ఇస్తుంది. శెనగపిండిలో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి చర్మాన్ని అందంగా మార్చుతుంది.

శెనగపిండిని ఎన్నో ఏండ్లుగా చర్మ సంరక్షణకు ఉపయోగిస్తు వస్తున్నారు. శెనగపిండిని సాధారణంగా చర్మంపై మొటిమలను తొలగించడానికి, చర్మ రంగును మార్చడానికి ఉపయోగిస్తారు. దీనిలో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి చర్మాన్ని అందంగా మారుస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి శెనగపిండి బాగా ఉపయోగపడుతుంది. ఇవి చర్మ రంధ్రాలను శుభ్రపరచడానికి, అదనపు నూనె, ధూళి, బ్యాక్టీరియా, ఇతర మలినాలను తొలగించడానికి సహాయపడతాయి. చర్మ సంరక్షణ కోసం శెనగపిండిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
1. మూడు టేబుల్ స్పూన్ల శెనగపిండినిని తీసుకుని అందులో చిటికెడు పసుపు, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్, కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి, మెడకు అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మం అందంగా మెరిసేందుకు సహాయపడుతుంది.
besan
2. రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, చిటికెడు పసుపు వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ మొటిమలు, ముఖంపై ఉన్న నల్ల మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది.
3. కలబంద గుజ్జులో రెండు చిన్న చెంచాల శెనగపిండిని కలిపి ముఖానికి, మెడకు అప్లై బాగా చేయండి. 10 నిమిషాల తర్వాత కడిగేయండి.
4. మూడు టీస్పూన్ల శెనగపిండిలో ఒక టీస్పూన్ల ఓట్ మీల్, పెరుగును వేసి బాగా కలపండి. ఈ మిశ్రమానికి ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేయాలి. 5 నిమిషాల తర్వాత దీన్ని కడిగేయండి. ఈ ప్యాక్ డ్రై స్కిన్ ను తొలగిస్తుంది.
5. రెండు టీస్పూన్ల శెనగపిండిలో ఒక టీస్పూన్ పెరుగు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేయాండి. ఇది మంచి మాయిశ్చరైజర్ గా పనిచేసి మొటిమలను తొలగించడానికి సహాయపడుతుంది.
6. రెండు చిన్న టీస్పూన్ల ముల్తానీ మిట్టిలో ఒక చిన్న చెంచా శెనగపిండిని కొద్దిగా రోజ్ వాటర్ ను వేసి కలపండి. దీన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి
7. ఒక టీస్పూన్ శెనగపిండిలో ఒక టీస్పూన్ టమోటా రసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై నల్లని మచ్చలను తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.
<p>face pack</p>
8. ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ను మిక్స్ చేసి ముఖానికి, మెడకు అప్లై చేయండి. ఈ ప్యాక్ చుండ్రును తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.