వావ్.. చెరకు రసంతో ఇన్ని అద్బుత ప్రయోజనాలున్నాయా..?
Benefits of sugar cane juice: చెరకు రసమే అని తేలిగ్గా తీసిపారేయకండి.. చెరుకు రసం తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. దీన్ని తాగితే ఏమొస్తుందని తాగకుంటే మాత్రం ఈ ప్రయోజనాలన్నింటినీ మీరు మిస్ అయినట్టే మరి..

సమ్మర్ రాకతో ప్రతి మార్కెట్ లోనూ.. రోడ్లకు ఇరువైపులా చెరకు రసం బండ్లు దర్శనమిస్తుంటాయి. ఈ చెరకు రసంలో ఎన్నో పోషకవిలువలు ఉంటాయి. ఇందులో అంత విశేషమేముందని దీన్ని తాగకుంటే మాత్రం మీరు ఈ ప్రయోజనాలను మిస్ చేసుకున్న వారవుతారు మరి.
ఇన్ స్టంట్ ఎనర్జీ: బాగా అలిసిపోయినప్పుడు గ్లాస్ చెరుకు రసాన్ని తాగండి. తక్షణమే మీకు ఎనర్జీ వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రసం ఎనర్జీ బూస్టర్ లా పనిచేస్తుంది మరి.. వేసవి తాపాన్ని తీర్చడానికి కూడా ఈ రసం ఎంతో సహాయపడుతుంది.
అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.. లివర్, కిడ్నీ పనితీరు మెరుగుపడటానికి చెరకు రసం బాగా సహాయపడుతుంది. అంతేకాదు మన శరీరంలోని ట్యాక్సిన్స్ ను బయటపటకు పంపడానికి ఎంతో సహాయపడుతుంది.
sugar cane
మలబద్దకం.. చెరకులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్ని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడం మొదలుపెడుతుంది. దీంతో మలబద్దకం సమస్య కూడా ఇట్టే తగ్గిపోతుంది.
sugar-cane-juice
ఇన్ ఫెర్టిలిటీ.. ఇన్ ఫెర్టిలిటీ సమస్యలున్నవారికి చెరకు రసం ఎంతో మేలు చేస్తుంది. శుక్రకణాల సంఖ్యను ఇది పెంచుతుంది.
తల్లులకు.. తల్లులు చెరకు రసాన్ని తాగడం వల్ల వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి పిల్లల తల్లులు ఎక్కువగా చెరకు రసాన్ని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
చర్మ రక్షణగా.. సమ్మర్ లో శరీరం నుంచి నీరంతా చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. దాంతో డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా చెరకు రసం మనల్ని కాపాడుతుంది. అంతేకాదు ఎండల తో చర్మం పాడవకుండా చేస్తుంది. ఇందుకోసం చెరకు రసాన్ని తరచుగా తాగుతూ ఉండాలి.
నేచురల్ డిటాక్స్ గా.. సమ్మర్ లో శరీర ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. వీటిని బ్యాలెన్స్ చేయడానికి చెరకు రసం ఎంతో సహాయపడుతుంది.