Benefits of raw banana: పచ్చి అరటిని తింటే ఇన్ని రోగాలు నయమవుతాయా?
Benefits of raw banana: అరటి పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే అరటిపండ్లను ఇష్టంగా తినే వారు చాలా మందే ఉన్నారు. అయితే పండిన అరటి పండే కాదు.. పచ్చి అరటి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అదేలా అంటే..?

Benefits of raw banana: నిత్యం ఒక అరటిపండును తింటే ఎటువంటి రోగాలు రావని వైద్య, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అరటి పండు వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అలా అని మనం పచ్చి అరటిపండ్లను మాత్రం అస్సలు తినము. మంచిగా పండిన అరటి పండ్లను మాత్రమే తింటుంటాం. కానీ పండుతో పాటుగా.. పచ్చి అరటి కాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సీజన్ లతో సంబంధం లేకుండా అరటి పండ్లు మార్కెట్లలో లభిస్తాయి. వీటిలో పోషకాలు, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన ఒంట్లో ఉండే మలినాలను బయటకు పంపడానికి, చెడు కొవ్వును తొలగించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఇవి జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. అలాగే ఓవర్ వెయిట్ ను తగ్గించడానికి కూడా తోడ్పడుతాయి.
నిత్యం ఒక అరటిని తింటే మీ శరీరానికి కావాల్సిన మెగ్నీషియం, పొటాసియం, జింక్, విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి,ఫాస్పరస్ వంటి పోషకాలు అందుతాయి. ఇవన్నీ మిమ్మల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతాయి. ఈ పచ్చి అరటిని మంచిగా ఉడకబెట్టి దానిపై కొద్దిగా ఉప్పు జల్లుకుని తినొచ్చు. దీన్ని తింటే మీ పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఈ పచ్చి అరటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. పచ్చి అరటిలో రెసిస్టెంట్ స్టార్చ్, ఫైబర్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
Raw Banana
మధుమేహులకు.. పచ్చి అరటి మధుమేహులకు ఎంతో సహాయపడుతుంది. వీటిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటీస్ మస్యను తగ్గించడానికి సహాయపడతాయి.
గుండె ఆరోగ్యానికి.. పచ్చి అరటిని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే పీచు పదార్థం పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడానికి సహాయపడుతుంది.
ఊబకాయాన్ని నియంత్రిస్తుంది.. ఓవర్ వెయిట్ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇందులోఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. దీన్ని తక్కువగా తీసుకుంటే సులువుగా బరువు తగ్గుతారు.
చర్మానికి మంచిది.. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఎన్నో విటమిన్లు, ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి ముఖంపై ముడతలను తొలగిస్తాయి.