Belly Fat : జస్ట్ 30 రోజుల్లోనే బెల్లీ ఫ్యాట్ కు గుడ్ బాయ్ చెప్పే డ్రింక్ ఇదే..
Belly Fat : బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి బయటపడాలనుకునే వారికి గుడ్ న్యూస్.. జస్ట్ నెల రోజుల్లోనే బెల్లీ ఫ్యాట్ కు గుడ్ బాయ్ చొప్పుచ్చు. తెలుసా.. అవును ఈ వంటింటి చిట్కాతో కేవలం నెలరోజుల్లోనే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.

belly fat
Belly Fat : మారుతున్న జీవనశైలీ, రోజు వారి ఆహారపు అలవాట్ల మూలంగా నేడు ఎంతో మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ప్రస్తుతం సాధారణమైనదిగా మారిపోయింది. కానీ దీనివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయాల్సి వస్తుంది.
belly fat
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో జనాలకు వ్యాయామం చేసే సమయం కూడా ఉండటం లేదు. ముఖ్యంగా ఆకలేస్తే చాలు కడుపు నిండిందా లేదా అనేదే చూస్తున్నారు కానీ అది హెల్త్ కు మంచి చేసేదా..? చెడు చేసేదా? అని చూడకుండా తింటున్నారు. దీనివల్ల ఎంతో మంది అధిక బరువు సమస్య బారిన పడుతున్నారు.
క్రమశిక్షణ లేని ఆహారం వల్లే ఎంతో మంది స్థూలకాయం బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు సమస్య వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయట పడటానికి క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం, ప్రత్యేక డైట్ ను ఫాలో అవ్వడంతో పాటుగా.. కొన్ని రకాల వంటింటి చిట్కాలను పాటించాలని నిపుణులు చెబతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి..
బెల్లీ ఫ్యాట్ ను ఇలా తగ్గించండి.. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించేందుకు వాము ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం ఒక గ్లాస్ నీళ్లను తీసుకుని అందులో కొంత వామును వేయాలి. ఉదయాన్నే ఆ నీటిని పరిగడుపునే తాగాలి. క్రమం తప్పకుండా ఈ చిట్కాను ఫాలో అయితే నెల రోజుల్లోనే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఈ వాములో ఉండే థైమోల్ ఫ్యాట్ ను కరిగించడానికి సహాయపడుతుంది.
వామును తింటే Digestion System మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ వాము ఎసిడిటీ సమస్యను నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
నానబెట్టిన వాము నీళ్లలో పొటాషియం, అయోడిన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
కీరదోసతో మేలు.. మలబద్ధకం, ఆస్తమా, గ్యాస్ వంటి సమస్యలున్న వారికి కీరదోసకాయ ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ పరిగడుపున కీరదోస కాయను నానబెట్టిన నీటిని తాగితే కడుపుకు సంబంధించిన రోగాలతో పాటుగా ఇవి కూడా తగ్గుతాయి.
కీరదోసకాయతో పాటుగా వాము నీటిని ఒక నెల రోజుల పాటు పరిగడుపున తాగడం వల్ల నెల రోజుల్లో 3 నుంచి 4 కిలోల వెయిట్ లాస్ అవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు.