MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మీరు అందంగా కనిపించాలా? అయితే ముల్తానీ మట్టిని ఈ విధంగా ఉపయోగించండి

మీరు అందంగా కనిపించాలా? అయితే ముల్తానీ మట్టిని ఈ విధంగా ఉపయోగించండి

ముల్తానీ మట్టి మన ముఖాన్ని అందంగా, కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది. దీనిలో ముఖంపై జిడ్డును పోగొట్టే లక్షణాలు ఉంటాయి. అంతేకాదు ఈ ముల్తానీ మిట్టి మన చర్మాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. 
 

R Shivallela | Published : Oct 08 2023, 02:50 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
multani mitti

multani mitti

ముల్తానీ మట్టి మన ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. అలాగే చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ మట్టిని ఉపయోగించడం వల్ల మన అందం పెరుగుతుంది. ముఖాన్ని తేమగా ఉంచుతుంది. జిడ్డును పోగొడుతుంది. అయితే ఈ ముల్తానీ మట్టిని మొటిమలను తగ్గించుకోవడానికి కూడా ఉపయోగిస్తారు తెలుసా? ముల్తానిమిట్టి మన చర్మం పీహెచ్ స్థాయిని సమతుల్యం కూడా చేస్తుంది. అలాగే చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. చర్మంలోని అదనపు నూనెను కూడా తొలగించడానికి సహాయపడుతుంది.

25
Image: Getty

Image: Getty

ముల్తానీ మిట్టిని ఉపయోగించడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మురికి అంతా పోతుంది. అలాగే  దీన్ని చర్మాన్ని శుద్ధి చేయడానికి, చర్మంపై నూనెను గ్రహించి క్రిమిసంహారక చేయడానికి ఉపయోగిస్తారు. ఇది చర్మ రంధ్రాల నుండి అదనపు నూనెను, దుమ్ము, ధూళిని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. అందంగా కనిపించడానికి ముల్తానీ మట్టిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

35
Image: Getty Images

Image: Getty Images

1. ముందుగా ఒక టీస్పూన్ ముల్తానీ మిట్టిని తీసుకుని అందులో రెండు చెంచాల రోజ్ వాటర్ ను పోసి ప్యాక్ ను తయారుచేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేయండి. ఈ ప్యాక్ ను వారానికి మూడుసార్లు వేసుకుంటే మీరు అందంగా కనిపిస్తారు. మొటిమల సమస్య కూడా ఉండదు. 
 

45
Asianet Image

2. 1 టేబుల్ స్పూన్ టమోటా జ్యూస్ ను తీసుకుని అందులో టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టిని, ½ టీస్పూన్ పసుపును వేయండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేయండి. ఆ తర్వాత ఈ ప్యాక్ ను ముఖానికి బాగా అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని నీట్ గా కడుక్కోండి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు ఉపయోగించొచ్చు.
 

55
Asianet Image

3. ఒక టీస్పూన్ ముల్తానీ మిట్టిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగును వేయండి. దీన్ని బాగా కలగలిపి ప్యాక్ లా  తయారుచేయండి. తర్వాత ఈ ప్యాక్ ను ముఖమంతా అప్లై చేయండి. ఈ ప్యాక్ ముఖంలోని నలుపుదనాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఇది మీ ముఖాన్ని అందంగా, తెల్లగా చేస్తుంది. 

R Shivallela
About the Author
R Shivallela
సౌందర్యం
 
Recommended Stories
Top Stories