Beauty Tips: అందం కోసం అన్ని క్రీములు వాడేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి?
Beauty Tips: అందంగా కనిపించడం కోసం కంటికి కనిపించిన ప్రతి క్రీమ్ ని వాడుతూ ఉంటారు నేటి యువత. అలా కాకుండా మీ చర్మానికి ఏది అవసరమో అదే వాడమంటున్నారు నిపుణులు అదేంటో చూద్దాం.
అందంగా కనిపించడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు నేటి యువత ఆఖరికి కాస్మెటిక్ సర్జరీలకి సైతం వెనుకాడటం లేదు. అంత వరకు వెళ్లలేని చాలామంది ఎవరు ఏ చిట్కా చెప్పిన అవి ఫాలో అయిపోతూ ఉంటారు. ఆ క్రీములు ఈ క్రీములు అంటూ అసలు వారి చర్మానికి పడతాయో పడవో కూడా పరీక్షించుకోకుండా వాడేస్తూ ఉంటారు.
అయితే అలా చేయడం వలన కొత్త అందం రావడం సంగతి పక్కనపెట్టి ఉన్న అందం ఊడిపోయే పరిస్థితిలు వస్తాయంటున్నారు నిపుణులు. అలా కాకుండా అసలు మీ చర్మానికి ఉన్న సమస్య ఏమిటి తెలుసుకున్న తర్వాత వాటికి కావలసిన విటమిన్లు ఉన్న..
ఉత్పత్తులని ఉపయోగించడం వలన పరిష్కారం ఉంటుంది అంటున్నారు. కళ్ళ చుట్టూ నల్లటి వలయాలతో బాధపడే వారికి విటమిన్స్ కె ఎక్కువగా అవసరం పడుతుందట కాబట్టి విటమిన్ కె కలిగి ఉన్న ఐ క్రీమ్ ని వాడటం వల్ల సమస్య తగ్గుతుందట.
అలాగే పొడి చర్మం ఉన్నవారు, చర్మం గరుకుగా ఉన్నవారు ఎక్కువగా ఈ విటమిన్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్లని మాయిశ్చరైజర్స్ ని వాడటం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. అలాగే ముఖంపై మొటిమలు రాకుండా విటమిన్ ఏ ఉపకరిస్తుంది.
జిడ్డు చర్మం ఉన్న వాళ్లు విటమిన్ ఏ లభించే క్రీములు వాడుతూ పాల పదార్థాలు చేపలు ముదురు రంగు, పండ్లు తమ ఆహారంలో భాగంగా చేసుకోవడం చాలా మంచిది. అలాగే చర్మం ముడతలు పడుతున్నట్లుగా అనిపిస్తే విటమిన్ సి ఉన్న క్రీములు రాయటం వలన చర్మం పై ముడుతలు తగ్గుతాయి.
అలాగే విటమిన్ సి జోడించిన మాయిశ్చరైజరు సంస్కృతిలోషన్ వాడటం వలన అతినేలనేహితికరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. అలాగే చర్మంపై తామర, దురద ఉంటే విటమిన్ డి చక్కని పరిష్కారం అంటున్నారు నిపుణులు.