MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Bathukamma 2023: ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ.. స్పెషాలిటీ ఇదే..!

Bathukamma 2023: ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ.. స్పెషాలిటీ ఇదే..!

Bathukamma 2023:తెలంగాణాలో ఎంతో వైభవంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మ ఒక్కటి. తీరొక్క పువ్వులతో అందంగా ముస్తాబయ్యే బతుకమ్మ పండుగ ఆడవాళ్లకు ఎంతో ఇష్టం. గునుగు పువ్వులు, తంగేడు పువ్వులతో బతుకమ్మను తయారుచేసి ఆట పాటలతో చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఇప్పటికే మనం ఏడు రోజుల బతుకమ్మను జరుపుకున్నాం. ఈ రోజు ఎనిమిదో రోజు. ఈ రోజు మనం వెన్నముద్దల బతుకమ్మను జరుపుకోబోతున్నాం. 

R Shivallela | Published : Oct 21 2023, 03:05 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

తెలుగు క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏడాది అశ్విని మాసంలో బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య నాడు ప్రారంభమవుతుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం.. ఇది సెప్టెంబర్ - అక్టోబర్ లో వస్తుంది.  పువ్వులంటే ఎంతో ప్రేమున్న పార్వతీదేవిని స్మరించుకోవడానికి కూడా బతుకమ్మ పండును జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. 

25
ప్రజల విషయాన్నీ పక్కకుంచితే, తెలంగాణ అస్థిత్వంగా బతుకమ్మను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత మాత్రం ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ జాగృతిది, దాని అధ్యక్షురాలు కవితది. తెలంగాణ నుంచి టెక్సాస్ వరకు తెలంగాణవారు ఎక్కడుంటే అక్కడ బతుకమ్మ ఉత్సవాల నిర్వహణను ప్రోత్సహిస్తూ, కుదిరితే అక్కడ ప్రత్యక్షమవుతూ ఈ బతుకమ్మ పండుగకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. ఈసారి జాగృతివారు కూడా ప్రతిసారి చూపెట్టేంత ఉత్సవాహాన్ని చూపెట్టడంలేదనేది వినపడుతున్న మాట. కవిత కూడా ఈసారి దూరంగా ఉన్నారు.

ప్రజల విషయాన్నీ పక్కకుంచితే, తెలంగాణ అస్థిత్వంగా బతుకమ్మను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత మాత్రం ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ జాగృతిది, దాని అధ్యక్షురాలు కవితది. తెలంగాణ నుంచి టెక్సాస్ వరకు తెలంగాణవారు ఎక్కడుంటే అక్కడ బతుకమ్మ ఉత్సవాల నిర్వహణను ప్రోత్సహిస్తూ, కుదిరితే అక్కడ ప్రత్యక్షమవుతూ ఈ బతుకమ్మ పండుగకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. ఈసారి జాగృతివారు కూడా ప్రతిసారి చూపెట్టేంత ఉత్సవాహాన్ని చూపెట్టడంలేదనేది వినపడుతున్న మాట. కవిత కూడా ఈసారి దూరంగా ఉన్నారు.

ఇకపోతే బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఆడవాళ్లకు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. ఈ పువ్వుల పండుగను ఆడపడుచులు మరే పండుగను జరుపుకోనంత ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. తీరొక్క పువ్వులతో అందమైన బతుకమ్మను పేర్చి రకరకాల నైవేద్యాలను సమర్పిస్తారు. చివరి రోజు బతుకమ్మను అందంగా గోపురాకారంలో పేర్చి మళ్లి రా తల్లి అంటూ చెరువులో నిమ్మజ్జనం చేస్తారు. 

35
Asianet Image

తెలంగాణాకు ఎంతో ప్రత్యేకమైన ఈ పండుగలో ఇప్పటికే ఏడు రోజులు గడిచిపోయాయి. ఎంగిలిబతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానెబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మను ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ఈ రోజు ఎనిమిదో రోజు. ఈ రోజు మనం వెన్నముద్దల బతుకమ్మను జరుపుకోబోతున్నాం. ఈ రోజు గునుగు పూలు, తంగేడు పూలు, బంతిపూలు వంటి తీరొక్క పువ్వులతో ఎనిమిది ఎంతరాలుగా బతుకమ్మను అందంగా గోపురాకారంలో పేరుస్తారు. ఇక సాయంత్రం వేళల్లో బతుకమ్మను వాకిట్లో పెట్టి ఆడపడుచులంతా చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు చెప్పుకుంటూ ఆడుతారు. 
 

45
Asianet Image

ఎనిమిదో రోజు ప్రసాదంగా బెల్లం, నువ్వులను కలిపి పెడతారు. ఇక రేపే తొమ్మిదో రోజు. అంటే ఈ రోజు మనం సద్దుల బతుకమ్మను జరుపుకుంటాం. అంటే రేపటితో బతుకమ్మ సంబురాలు ముగిపోతాయన్న మాట. 

55
Bathukamma 2023

Bathukamma 2023

మీకు తెలుసా? వెన్నముద్దల బతుకమ్మ ప్రసాదం మన ఆరోగ్యానికి ఒక ఔషదంలా పనిచేస్తుంది. అవును నువుల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. వీటిలో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నువ్వులను తింటే మన ఎముకలు బలంగా ఉంటాయి. బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుండె కూడా బలంగా ఉంటుంది. గుండె జబ్బులకు దూరంగా కూడా ఉంటాం. ఇకపోతే బెల్లం.. బెల్లం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు మంచి పరిమాణంలో ఉంటాయి. బెల్లాన్ని తింటే రక్తహీనత సమస్య పోతుంది. అలాగే మన జీర్ణవ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. ఈ రెండింటి కలయిక మన ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుతుంది. అందుకే చాలా మంది భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని చప్పరిస్తారు. నువ్వులను రోజూ తింటే మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉంటామంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 

R Shivallela
About the Author
R Shivallela
 
Recommended Stories
Top Stories