Mango kernels: మామిడి పండ్లతో కొలెస్ట్రాల్ కరగడమే కాదు.. ఆ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి తెలుసా..
Mango kernels: కొలెస్ట్రాల్ ను నియంత్రించుకోవాలనుకునే వారికి మామిడి గింజలు (Mango kernels) ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడమే కాదు రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా నియంత్రణలో ఉంటాయి.

ప్రస్తుత కాలంలో అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ తో బాధపడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీన్ని కరిగించేందుకని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వీరికి మామిడి గింజలు (Mango kernels) ఎంతో ఉపయోగపడతాయి. మామిడి పండ్లను తిన్న తర్వాత మామిడి గింజలు(మామాడి టెంకలో ఉండే విత్తనం) ఎందుకులే అనుకుని వాటిని పడేసే వారు చాలా మందే ఉన్నారు. కానీ వీటిని తినడం వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ కరుగుతుంది. అంతేకాదు దీని వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటంటే..
mango
మామిడి గింజలు చేసే మేలు.. వేసవిలో మామిడిపండ్లకు కొదవే ఉండదు. సీజన్ మొదలైనప్పటి నుంచి మామిడి పండ్లను ఇష్టంగా లాగించే వారు చాలా మందే ఉన్నారు. ఇవి టేస్ట్ లో వావ్ అనిపిస్తాయి కూడా. అంతేకాదు ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. వీటితో పాటుగా మామిడి గింజలు కూడా మనకు ప్రయోజనకరంగానే ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్ నియంత్రించబడుతుంది. అలాగే పొట్ట సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి.
mango
బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మామిడి గింజలు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. మధుమేహులు వీటిని తీసుకోవడం వల్ల వారి రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటుంది. కాబట్టి మామిడి పండ్లను తిన్న తర్వాత వీటిని తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మామిడి గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు..
పీరియడ్స్ నొప్పి తగ్గేందుకు మామిడి గింజలు చక్కటి మెడిసిన్ లా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల పీరియడ్స్ లో తలెత్తే కడుపు నొప్పి ఇట్టే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
mango
హార్ట్ పేషెంట్స్ వీటిని ఎలాంటి అనుమానం లేకుండా తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె సంబంధిత సమస్యలున్న వారు మామిడి గింజలను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. నిజానికి శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉన్నప్పుడే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
mango
ఈ గింజలు దంతాలకు కూడా ప్రయోజనకరంగానే ఉంటాయి. వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ కాల్షియం దంతాలను బలంగా చేసేందుకు ఉపయోగపడుతుంది.