ఈ చెడు అలవాట్ల వల్లే వృద్ధాప్యం త్వరగా వస్తుంది..
నిత్య యవ్వనంగా కనిపించాలని ఎవరికుండదు చెప్పండి. ఇందుకోసం ఎన్నో ప్రయోగాలు కూడా చేస్తుంటారు. అయితే వీరు చేసే కొన్ని తప్పుల వల్లే వృద్ధాప్యం త్వరగా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ప్రతి ఒక్కరూ యవ్వనంగా ఉండాలని ఆరాటపడుతుంటారు. ఇందుకోసం ఎన్నో ఫేస్ క్రీములను ఇంటి చిట్కాలను ఫాలో అయిపోతుంటారు. కానీ కొన్ని అలవాట్ల వల్ల వృద్ధాప్యం చాలా తొందరగా వస్తుంది. ముఖ్యంగా శరీరానికి హానీ చేసే అలవాట్ల మూలంగానే ఇది తొందరగా వస్తుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
aging
ఈ అలవాట్ల వల్ల మనం ఎన్నో జబ్బుల పాలవ్వడమే కాదు వృద్ధాప్య ప్రక్రియ కూడా వేగవంతం అవుతుందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలోనే చిన్నవయసు వారు సైతం ముసలివాళ్లలాగ కనిపిస్తారు. వృద్ధాప్యానికి దారి తీసే చెడు అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
aging
టెన్షన్.. దేనిగురించైనా ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళన పడిపోతే మాత్రం మీరు త్వరగా ముసలివాళ్లు అయిపోతారు. ఇలాంటి వారు శారీరక లేదా మానసిక అస్వస్థతకు కూడా బాదితులుగా మారిపోవచ్చు. ఈ టెన్షన్ అనేది సైలెంట్ కిల్లర్ అనే చెప్పాలి. దీనిమూలంగా మానసికంగానే కాదు శారీరకంగా కూడా క్రుంగిపోయే అవకాశం ఉంది. అందుకే ఒత్తిడిని జయించే మార్గాలను వెతుక్కోవాలి. ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి.
తగినంత నిద్ర లేకపోవడం.. అలసిన శరీరం మళ్లీ పునరుత్తేజంగా మారడానికి మనకు ఖచ్చితంగా 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. నిద్రవల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. హుషారుగా కూడా ఉంటారు. అంతేకాదు ఇది వృద్ధాప్య ప్రక్రియను కూడా నెమ్మదిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్య ఎక్కువైంది. ఈ సమస్యను యువత ఎక్కువగా ఫేస్ చేస్తుంది. ఈ సమస్య వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సరైన ఆహారం.. పోషకలేమి ఆహారం కూడా వృద్ధాప్యానికి కారణమవుతుంది. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొవ్వులు , సోడా వంటి ఆహారాలు మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. వీటివల్ల Lifespan rate తగ్గుతుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వీలైనంత త్వరగా మానేయండి. అప్పుడే మీరు ఆరోగ్యంగా, నిత్య యవ్వనంగా ఉంటారు.
స్మోకింగ్ మరియు ఆల్కహాల్.. ఒత్తిడి లేదా ఆందోళనల నుంచి బయటపడటానికి చాలా మంది స్మోకింగ్ లేదా ఆల్కహాల్ ను తీసుకోవడం అలవాటు చేసుకుంటుంటారు. ముఖ్యంగా యువతే వీటిని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అధిక మొత్తంలో వినియోగించడం వల్ల వీరు చాలా తొందరగా వృద్ధాప్యం బారిన పడతారు. అంతేకాదు ఈ అలవాట్ల వల్ల మెదడుపై చెడు ప్రభావం పడుతుంది. బరువు కూడా విపరీతంగా పెరుగుతారు.