Valentines Day: ఇక్కడ వాలెంటైన్స్ డే జరుపుకుంటే జైలు పాలే!
ఫిబ్రవరి నెల ప్రేమికులకు చాలా ప్రత్యేకమైంది. వారం రోజులపాటు వారికి నచ్చిన వ్యక్తులకు నచ్చిన కానుకలను ఇచ్చి వారి ప్రేమను ఎక్స్ ప్రెస్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని దేశాల్లో ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోరట. వాలెంటైన్స్ డేను కొన్ని దేశాలు నిషేధించాయి. అవెంటో ఇప్పుడు చూద్దాం.

ఫిబ్రవరి నెల అనగానే అందరికి గుర్తుచ్చేది. వాలెంటైన్స్ డే. చాలామంది ప్రేమికులు ఆ రోజు వారి ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. అయితే కొన్ని దేశాల్లో ఈ ప్రేమికుల దినోత్సవాన్ని నిషేధించారట. అక్కడ వాలెంటైన్స్ డే జరుపుకుంటే.. శిక్ష అనుభవించాల్సిందేనట.
ఇరాన్
ఇరాన్ లో ప్రేమికుల దినోత్సవాన్ని నిషేధించారు. అక్కడ వాలెంటైన్స్ డేను పాశ్చాత్య సంస్కృతిగా భావిస్తారు. మత పెద్దలు దీన్ని వ్యతిరేకిస్తారు.
పాకిస్తాన్ లో..
మన పొరుగు దేశమైన పాకిస్తాన్ కూడా ప్రేమికుల దినోత్సవాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 2018లో హైకోర్టు వాలెంటైన్స్ డే వేడుకలను, మీడియా కవరేజీని నిషేధించింది.
సౌదీ అరేబియాలో..
సౌదీ అరేబియాలో వాలెంటైన్స్ డే ను పెద్దగా జరుపుకోరట. వేడుకలు జరుపుకున్నందుకు 2014లో దాదాపు 39 మంది జైలు పాలయ్యారు. 2018లో నిషేధం ఎత్తివేశారు.
మలేషియాలో..
మలేషియాలో కూడా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోరట. 2005లో ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు జరిగాయి.
ఇండోనేషియాలో..
ఇండోనేషియాలో అధికారిక నిషేధం లేనప్పటికీ.. సురబాయా, మకాస్సార్ వంటి ప్రాంతాల్లో ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకించే వారు ఉన్నారు.
ఉజ్బెకిస్తాన్..
ఉజ్బెకిస్తాన్ లో ప్రేమికుల దినోత్సవం బదులు బాబర్ జన్మదినాన్ని జరుపుకుంటారు. అక్కడ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడం చట్టవిరుద్ధం కాదు.