ఇలాంటి దోస్తులకు దూరంగా ఉండటమే మంచిది
స్నేహాన్ని ఎంతో పవిత్రమైన బంధంగా భావిస్తారు. ఒక మంచి స్నేహితుడు ఉంటే చాలు మనం ఉత్తనమైన వ్యక్తిగా ఎదగొచ్చు. కానీ తప్పుడు రకం స్నేహితులు మన పక్కన ఉంటే మనం ఎన్నో కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే చెడు ప్రవర్తన కలిగిన దోస్తులకు దూరంగా ఉండటమే మేలు..
Image: Getty
జీవితంలో స్నేహితులు లేని వారుండరు. కొంతమంది చిన్నప్పటి నుంచి ఎంత పెద్దవారైనా తమ స్నేహాన్ని మాత్రం మర్చిపోరు. తరచుగా స్నేహితులను కలుస్తూనే ఉంటారు. మంచి చెడు అంటూ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. మన జీవితంలో స్నేహితుడు ఎంతో ముఖ్యమైన వ్యక్తి. స్కూల్, కాలేజ్ అంటూ ఎంతో మంది పరిచయమవుతారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే మనకు స్నేహితులు అవుతారు. ఎన్ని సమస్యలొచ్చినా మంచి స్నేహితులను మాత్రం వదులుకోవద్దని చెప్తారు పెద్దలు. సంతోషంలోనే కాదు బాధ, దుఖం అంటూ ప్రతి మూమెంట్ లో స్నేహితుడు మనకు అండదండటగా ఉంటాడు. కానీ కొంతమంది మన స్నేహితులుగా ఉంటూ మనకే గొయ్యి తొవ్వుతారు. హాని తలపెడతారు. చెడు పనులను చేయిస్తుంటారు. అందుకే అలాంటి వారికి దూరంగా ఉండాలి. ఎలాంటి స్నేహితులకు దూరంగా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty
ది లయ్యర్
అబద్ధాలు, అసత్యాలు ఎప్పుడూ చెప్పే స్నేహితులను వీలైనంత తొంరదగా దూరం పెట్టాలి. ఈ రకమైన స్నేహితుడు తన తప్పులను కప్పి పుచ్చడానికి అబద్దాల మీద అబద్దాలను చెబుతూనే ఉంటాడు. లేదా మీ కంటే మెరుగ్గా కనిపించడానికి ప్రయత్నిస్తాడు. అబద్ధాలను చెప్పే వ్యక్తిని నమ్మడం చాలా కష్టం. ప్రత్యేకించి ఒకే వ్యక్తి ఎప్పుడూ మీకు అబద్ధం చెబుతుంటే.. వారిని దూరం పెట్టండి. నిజాయితీగా ఉండే స్నేహితులకు మాత్రమే దగ్గరగా ఉండండి.
పుకార్లు చెప్పేవాడు
గాసిప్పర్ అంటే ఎదుటివారి గురించి మాట్లాడటానికి, పుకార్లను స్ప్రెడ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి. ఈ రకమైన స్నేహితుడు సాధారణంగా మీకు చిరాకు కలిగించడమే కాకుండా..వారి ప్రవర్తన కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే పుకార్లు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయి. అలాగే అనవసరమైన డ్రామాను సృష్టిస్తాయి. అందుకే ఇలాంటి వ్యక్తికి వీలైనంత దూరంగా ఉండండి.
ది మ్యూచర్
మ్యూచర్ ఎప్పుడూ మీ నుంచి తీసుకుంటాడు. కానీ దేనిని తిరిగి ఇవ్వడు. ఈ రకమైన స్నేహితుడు ఎప్పుడూ మీ నుంచి మాత్రమే ఆశిస్తాడు. ప్రతిఫలంగా ఏదో ఒకటి ఆశిస్తాడు. కానీ మీ నుంచి తీసుకున్న దానికీ ఏదీ ఇవ్వడు. ఇలాంటి వ్యక్తులు ఇతరులను సద్వినియోగం చేసుకుంటారు. వాళ్ల పనులను చేయించుకుంటారు. ఈ రకమైన స్నేహితులకు దూరంగా ఉండటమే మంచిది.
ది నెగెటివ్ నాన్సీ
నెగెటివ్ నాన్సీ అంటే ఎప్పుడూ ప్రతికూలంగానే ఆలోచించడం. ప్రతి పనిని నెగిటీవ్ గానే చూస్తారు. ఇలాంటి వారు ఎదుటివారు చేపే ప్రతి పనిని చెడుగానే చూస్తారు. ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఉండటం వల్ల మీరు ఏ పనిని మొదలుపెట్టలేరు. ఏ పనిలో సక్సెస్ కాలేరు. ఇది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. చివరికి ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఈ రకమైన స్నేహితులకు దూరంగా ఉండటమే మీకు మంచిది.
యూజర్
యూజర్ అంటే తమను తాము మాత్రమే చూసుకునే వ్యక్తి, అలాగే ఇతరుల గురించి పట్టించుకోని వ్యక్తి. వీళ్లు ఇతరులను ఎన్ని రకాలుగా సద్వినియోగం చేసుకోవాలో అన్ని విధాలా ఉపయోగించుకుంటారు. అంతేకాదు వీరు తమ చుట్టూ ఉన్నవారిని ఎలా ప్రభావితం చేస్తారనే దాని గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా వారి ప్రయోజనం కోసమే ఉపయోగించుకుంటారు. ఈ రకమైన స్నేహితుడు వ్యక్తులను కూడా తారుమారు చేయొచ్చు లేదా మీరు చేయటానికి ఇష్టపడని పనులను కూడా మీ చేత చేయించడానికి ప్రయత్నిస్తారు. యూజర్లకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే వీరు ప్రమాదకరమైన వారు. వీరితో ఉంటే మీరు ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది.