చుండ్రు లేకుండా పోవాలంటే ఏం చేయాలి?
చుండ్రు వల్ల నెత్తిమీద విపరీతంగా దురద పెడుతుంది. వెంట్రుకలు విపరీతంగా రాలిపోయి బట్టతల వస్తుంది. నెత్తి పల్చబడుతుంది. అందుకే దీన్ని సులువుగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
- FB
- TW
- Linkdin
Follow Us

dandruff
చాలా మందికి ఉన్న జుట్టు సమస్యల్లో చుండ్రు ఒకటి. ఇది చాలా చిన్న సమస్యగా అనిపించినా.. దీనివల్ల వెంట్రుకలు విపరీతంగా ఊడిపోతాయి. దీనివల్ల మగవారికి బట్టతల వస్తుంది. ఆడవారికి జుట్టంతా పల్చగా అవుతుంది. అంతేకాకుండా దీనివల్ల నెత్తిమీద విపరీతంగా దురద పెడుతుంది.
అసౌకర్యంగా ఉంటుంది. అందుకే దీన్ని తగ్గించుకునేందుకు రకరకాల యాంటీ డాండ్రఫ్ షాంపూలను, చికిత్సలను తీసుకుంటుంటారు. అలాగే ఇంటి చిట్కాలను కూడా ఫాలో అవుతుంటారు. అయినా చుండ్రు అస్సలు పోదు. అయితే నేచురల్ చిట్కాలతో నెత్తిమీద చుండ్రు లేకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
dandruff
ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్ తో నెత్తిమీద చుండ్రు లేకుండా చేయొచ్చు. దీనిలో యాంటీ బాక్టీరియల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చుండ్రును పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం ఆపిల్ సైడర్ వెనిగర్, నీళ్లను సమానంగా కలపండి. దీన్ని స్నానానికి ముందు నెత్తికి పెట్టండి. 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే నెత్తిమీద చుండ్రు తగ్గుతుంది.
Dandruff
కొబ్బరి నూనె
కొబ్బరి నూనెతో కూడా చుండ్రు పూర్తిగా పోతుంది. నిజానికి కొబ్బరి నూనె ఒక అద్భుతమైన నేచురల్ మాయిశ్చరైజర్. ఇది చుండ్రును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం కొబ్బరి నూనెను కొంచెం వీడి చేసి ఎక్కడైతే చుండ్రు ఉందో అక్కడ రాయండి. దీన్ని కొద్దిసేపు మసాజ్ చేయండి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే తలస్నానం చేయండి. ఇలా కొబ్బరి నూనెను రెగ్యులర్ గా ఉపయోగిస్తే మీ నెత్తి హైడ్రేట్ గా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పొడుగ్గా పెరుగుతుంది.
టీ ట్రీ ఆయిల్
టీట్రీ ఆయిల్ కూడా చుండ్రును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నెత్తిమీద చుండ్రును కలిగించే ఫంగస్ తో బాగా పోరాడుతాయి. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ ను కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్ నూనెలో మిక్స్ చేసి జుట్టుకు పెట్టండి. దీన్ని కాసేపు మసాజ్ చేయండి. దీన్ని తలస్నానం చేయడానికి ముందు దీన్ని 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేస్తే చుండ్రు క్రమంగా తగ్గిపోతుంది.
కలబంద
కలబందలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ముఖ్యంగా దీనిలో హైడ్రేటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది డ్రై నెత్తి ఉన్నవారికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం కొంచెం కలబంద జెల్ ను తీసుకుని నేరుగా తలకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. కలబంద జెల్ చుండ్రు, చుండ్రు వల్ల కలిగే వాపు, దురద, దద్దుర్లు వంటి సమస్యలు తగ్గిపోతాయి.