MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • Sunita Williams: సునీత స్పేస్‌ జర్నీ ఎలా సాగింది? ఏ రోజున ఏం జరిగిందో సమగ్ర సమాచారం..

Sunita Williams: సునీత స్పేస్‌ జర్నీ ఎలా సాగింది? ఏ రోజున ఏం జరిగిందో సమగ్ర సమాచారం..

ఎనిమిది రోజుల కోసం వెళ్లి ఏకంగా 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌, అమెరిక్‌ ఆస్ట్రోనాట్‌ బుచ్‌ విల్‌మోర్‌ విజయవంతంగా భూమిని చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్‌ అంతరిక్ష యాత్రలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలు ఏంటి.? ఏ రోజున ఏం జరిగింది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

3 Min read
Author : Narender Vaitla
Published : Mar 19 2025, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sunita Williams

Sunita Williams

సుధీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు భూమికి చేరారు భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్‌. అమెరికా వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌తో పాటు కలిసి భూమిపై సురక్షితంగా అడుగుపెట్టారు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి మంగళవారం తిరుగుప్రయాణం అయిన సునీతా విలియమ్స్, విల్మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27కి ఫ్లోరిడా తీరంలో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు.. డ్రాగన్‌ వ్యోమనౌక సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వగానే.. సహాయ బృందాలు రంగంలోకి దిగి.. క్రూ డ్రాగన్‌ను వెలికితీస్తాయి. 286 రోజుల తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్‌లు సురక్షితంగా భూమికి చేరారు. మరి ఈ 9 నెలల్లో జరిగిన కొన్ని కీలక ఘట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 

26
sunita williams

sunita williams

* సునీత విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లు 2024 జూన్‌ 5వ తేదీన ప్రముఖ సంస్థ బోయింగ్‌ చేపట్టిన తొలి అంతరిక్ష మానవ సహిత యాత్రలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) వెళ్లారు. 

* జూన్‌ 6వ తేదీన ఐఎస్‌ఎస్‌తో వారి వ్యోమ నౌక స్టార్‌ లైనర్‌ విజయవంతంగా అనుసంధానమైంది. అక్కడ పలు పరిశోధనలు చేసిన తర్వాత 8 రోజులకు విలియమ్స్ తిరిగి రావాల్సి ఉంది. 

* అయితే స్టార్‌ లైనర్‌లో థ్రస్టర్లు పనిచేయపోవడం, హీలియం లీకేజీ కారణంగా వారి తిరుగు ప్రయాణం వాయిదా పడింది. 

* 2024 జూన్‌ 12 తేదీన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ భూమిపైకి రావాల్సి ఉండగా. సాంకేతిక కారణాలతో రావడం లేదని నాసా ప్రకటించింది. 

* అయితే 2024 జూన్‌ 26వ తేదీన సునీత విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌లు భూమిపైకి తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా తెలిపింది. అయితే అప్పటికీ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో మళ్లీ వాయిదా వేసింది. 

* అన్ని అనుకూలిస్తే 2024 జూలై 2వ తేదీన వ్యోమగాములు భూమిపైకి రానున్నారని ఆ సమయంలో నాసా తెలిపింది. 
 

36

* కొన్ని రోజుల పరిశోధనల తర్వాత స్టార్‌లైనర్‌ వ్యోమగాములను తీసుకొచ్చేందుకు అనుకూలంగా ఉందని బోయింగ్ తెలిపింది. అయితే నాసా మాత్రం అందుకుఅంగీరించలేదు. 

* దీంతో సెప్టెంబర్‌ 6వ తేదీన స్టార్‌ లైనర్‌ వ్యోమగాములు లేకుండానే భూమిపైకి సురక్షితంగా చేరుకుంది. ఈ కారణంగా వ్యోమగాములు మరి కొంత కాలం అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది. 

* అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరినీ తీసుకొచ్చేందుకు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ క్రూ 9 మిషన్‌లో భాగంగా ఫాల్కన్‌ నైన్‌ రాకెట్‌ను 
సెప్టెంబర్‌ 28, 2024న నింగిలోకి పంపించారు. 

* 2024, సెప్టెంబర్‌ 29వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. డాకింగ్ ప్రక్రియ పూర్తికాగానే క్రూ నైన్‌ మిషన్‌లోని ఇద్దరు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశించారు. 

* ఈ ఇద్దరి వ్యోమగాములతో పాటు అక్కడే చిక్కుకుపోయిన సునీత, బుచ్‌ విల్మోర్‌లు 2025లో భూమిపైకి వస్తారని నాసా ఆ సమయంలో తెలిపింది. ఇదుకోసం క్రూ డ్రాగన్‌ వ్యోమ నౌకలో అదనంగా ఇద్దరికి సీట్లను కేటాయించారు. 
 

46
NASA astronauts Sunita Williams, Butch Wilmore, along with Nick Hague and Russian cosmonaut Aleksandr Gorbunov will return to Earth (Image Credit: X/@Commercial_Crew)

NASA astronauts Sunita Williams, Butch Wilmore, along with Nick Hague and Russian cosmonaut Aleksandr Gorbunov will return to Earth (Image Credit: X/@Commercial_Crew)

* 2025 ఫిబ్రవరిలో సునీత విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌తో పాటు మిగత ఇద్దరు ఆస్ట్రోనాట్స్‌ భూమిపైకి రావాల్సి ఉండగా మరోసారి వాయిదా పడింది. 

* మార్చి 12వ తేదీన స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ వ్యోమ నౌక ద్వారా వ్యోమగాములను వెనక్కి తీసుకొస్తున్న నాసా, స్పేస్‌ ఎక్స్‌ సంయుక్త ప్రకటన చేశాయి. 

* 2025 మార్చి 16న విజయవంతంగా డ్రాగన్‌ క్రూ వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌ వద్దకు చేరుకుంది. 

* ఇక భారత కాలమానం ప్రకారం మార్చి 18వ తేదీన ఉదయం 8.15 గంటలకు క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక తలుపు (హ్యాచ్‌) మూసివేత ప్రక్రియ జరిగింది. 

* ఉదయం 10.15 గంటలకు క్రూ డ్రాగన్‌.. ఐఎస్‌ఎస్‌తో అన్‌డాకింగ్‌ ప్రక్రియ మొదైంది. 1035 గంటలకు ఐఎస్‌ఎస్‌తో పూర్తిగా విడిపోయింది. 

* ఇలా విడిపోయిన వ్యోమనౌక భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 
 

56
Sunita williams return to earth

Sunita williams return to earth

* ఇలా భూమికి సమీపంగా చేరుకున్న వ్యోమనౌక సముద్రానికి 18 వేల అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని రెండు డ్రోగ్‌చూట్లు ఓపెన్‌ అయ్యాయి. 

* ఆ సమయంలో వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. డ్రోగ్‌చూట్లు సమర్థంగా పనిచేయడంతో క్రూడ్రాగన్‌ వేగం భారీగా తగ్గిపోయింది. 

* ఆ తర్వాత వ్యోమనౌక వేగం గంటకు 190 కిలోమీటర్లకు చేరుకోగానే.. సాగర జలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో రెండు ప్రధాన పారాచూట్లు ఓపెన్‌ అయ్యాయి.

66
Sunita williams return to earth

Sunita williams return to earth

* అలా వ్యోమనౌక వేగం క్రమంగా తగ్గుముఖంపట్టి ఫ్లోరిడాలోని తలహాసీ తీరంలో సముద్ర జలాల్లో వ్యోమనౌక నెమ్మదిగా ల్యాండ్‌ అయ్యింది. 

* నిమిషాల వ్యవధిలోనే స్పీడ్‌బోట్లలో అక్కడికి వచ్చిన రికవరీ సిబ్బంధి. వ్యోమనౌకను మేగన్‌ నౌకపైకి చేర్చారు. ఆ తర్వత వ్యోమ నౌకలో ఉన్న వ్యోమగాములను ఒక్కొక్కరిగా బయటకు తీశారు. ఇలా 9 నెలలు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత క్షేమంగా భూమికి తిరిగి చేరుకుంది. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
Neal Katyal : ట్రంప్ కే చుక్కలు చూపిస్తున్న భారత సంతతి లాయర్.. ఎవరీ నీల్ కత్యాల్..?
Recommended image2
US Tariffs : ట్రంప్ టారీఫ్స్ కు సుప్రీం బ్రేక్ .. అమెరికా అధ్యక్షుడి పవర్ ఈ చట్టంముందు తుస్సుమందిగా..!
Recommended image3
Bangladesh Cabinet : బంగ్లాదేశ్ కేబినెట్‌లో హిందూ మంత్రి.. ఎవరీ గయేశ్వర్ చంద్ర రాయ్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved