MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • కెన్యాలో కోళ్లను ఎత్తుకెళ్తున్న భారతీయ కాకులు: వాటిని చంపే పనిలో కెన్యా వాసులు

కెన్యాలో కోళ్లను ఎత్తుకెళ్తున్న భారతీయ కాకులు: వాటిని చంపే పనిలో కెన్యా వాసులు

భారతీయ కాకులు కెన్యా వాసులకు చికాకు పెట్టిస్తున్నాయి. వాటిని చంపేందుకు అక్కడి ప్రజలు విష ప్రయోగం చేస్తున్నారు. ఇండియా కాకులు కెన్యాలో అంత ప్రమాదకరంగా మారాయా?

2 Min read
Galam Venkata Rao
Published : Aug 07 2024, 09:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కెన్యా తీర ప్రాంత ప్రజలు ఇప్పుడు ఓ పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇండియా నుంచి వచ్చిన కాకులు... పర్యావరణంతో పాటు కెన్యా పౌల్ట్రీ ఫార్మ్స్, పర్యాటక ప్రాంతాల్లో చాలా ఇబ్బందులకు కారణం అవుతున్నాయి. దీంతో స్థానికులు, అధికారులు ఈ కాకులను నియంత్రించేందుకు నానా కష్టాలు పడుతున్నారు.

25
Why Kenya plans to kill a million Indian crows

Why Kenya plans to kill a million Indian crows

1890లలో బ్రిటిష్ పాలనలో ఉన్న జాంజిబార్ ద్వీప సమూహంలో వ్యర్థాల సమస్యను పరిష్కరించేందుకు భారత దేశంలోని కాకులను తూర్పు ఆఫ్రికాకు తీసుకెళ్లారు. వీటిని తొలిసారి 1947లో మొంబాసా పోర్టులో గుర్తించారు. అయితే, ఇప్పుడు ఈ కాకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీటి వల్ల పర్యావరణ సమతుల్యతకు, స్థానిక పక్షులకు పెను ముప్పు వాటిల్లింది.

35

పర్యావరణంపై ప్రభావం...

భారత్ నుంచి వచ్చిన కాకులు కెన్యాలోని వీవర్స్ (గిజిగాడు పిట్ట), వాక్స్‌బిల్స్ (పిచ్చుక లాంటి చిన్న పక్షి) తదితర స్థానిక పక్షుల సంఖ్యను తగ్గించాయి. ఇవి పంటలు, పశువులు, కోళ్లపై కూడా దాడి చేస్తున్నాయి. అవి కోడిపిల్లలను తినడం, గూళ్లపై దాడులు చేయడం వల్ల స్థానిక జీవజాతులకు గణనీయమైన హాని కలుగుతోంది. పర్యావరణవేత్తలు ఈ సమస్యను ఎదుర్కోవడానికి పలు మార్గాలను అన్వేషిస్తున్నారు.

45

కాకులపై విష ప్రయోగం..

కాకులను నియంత్రించడానికి కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్ (కేడబ్ల్యూఎస్) పర్యావరణ నిపుణులు, కమ్యూనిటీ నేతలు, హోటల్ పరిశ్రమ ప్రతినిధులతో కలిసి చర్యలు ప్రారంభించింది. ఈ చర్యల్లో భాగంగా, స్టార్లిసైడ్ అనే విషాన్ని ఇండియా కాకుల ఆహారంలో ప్రయోగిస్తున్నారు. ఈ విషం ఇతర పక్షులు లేదా జంతువులపై ప్రభావం లేకుండా కేవలం కాకులపై మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

విష ప్రయోగం చేయడానికి కాకులున్న ప్రాంతాల్లో కాకుండా.. ఇతర ప్రాంతాల్లో పక్షుల మాంసాన్ని ఎరగా వేస్తారు. ఎర వేసిన ప్రదేశాలకు కాకులు ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు వాటిపై విషప్రయోగం చేస్తారు. ఈ విష ప్రయోగం ఎలా పనిచేస్తుందని 2022లో నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 2వేల కాకులు చనిపోయాయి. న్యూజిలాండ్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ విషం దాదాపు 20 వేల కాకులను చంపేందుకు సరిపోతుందని అంచనా. కాగా, మరింత విషాన్ని న్యూజిల్యాండ్ నుంచి కెన్యా దిగుమతి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

అయితే, విష ప్రయోగం చేసి కాకులను చంపడంపై జంతు, పక్షుల హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకులకు విషం ఇవ్వడం అమానవీయమని, వాటి సంఖ్యను తగ్గించేందుకు హానికరం కాని పద్ధతులను అన్వేషించాలని వాదిస్తున్నారు. పెద్ద ఎత్తున విషప్రయోగం చేయడం స్వల్పకాలిక పరిష్కారం మాత్రమే అని పర్యావరణవేత్తలు అభిప్రాయపడ్డారు. కాకుల సంఖ్యను తగ్గించేందుకు కచ్చితమైన, మానవీయ విధానాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

55

కాకులను తరిమేందుకు ప్రత్యేక సిబ్బంది...

కెన్యాలోని కొన్ని హోటళ్లు కాకులను ట్రాప్ చేసే పనిలో ఉంటే, మరికొందరు వాటిని భయపెట్టేందుకు క్యాటాపుల్ట్ (క్యాట్‌బాల్) లాంటి వాటిని ఉపయోగిస్తున్నారు. మొంబాసా లాంటి పట్టణాల్లో కూడా ఈ కాకుల దాడులతో ప్రజలు, హోటళ్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పర్యాటకులు భోజనం చేస్తున్నప్పుడు కాకులు అక్కడికి వచ్చి తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని హోటల్ యజమానులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని తరిమికొట్టేందుకు, భయపెట్టేందుకు హోటళ్ల యాజమన్యాలు సిబ్బందిని నియమించుకోవాల్సి వస్తోంది.

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved