Thandel ott: ‘తండేల్’ ఏ ఓటిటి లో, ఎప్పటి నుంచి ?
Thandel ott: తండేల్ చిత్రం త్వరలోనే ఓటిటిలో విడుదల కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాకు ఫలానా రోజు విడుదల తేదీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ.65 కోట్లకు ఓటిటి హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Naga Chaithanya Thandel to Stream On this time in telugu
Thandel ott: తండేల్ చిత్రం అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి 14 కి కొత్త సినిమాలు రిలీజ్ అయిన తండేల్ చిత్రం మంచి ఆక్యుపెన్సీ సాధిస్తూ రన్ అవుతుంది. పైగా భారీ ఆశలు పెట్టుకొని రిలీజ్ చేసిన విశ్వక్ సేన్ లైలా చిత్రానికి నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో తండేల్ హవా మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.
ఇక సినిమా రన్ కొనసాగేలా మూవీ టీమ్ కూడా ప్రమోషన్స్ బాగా చేస్తుంది. ఈ సినిమా వందకోట్ల క్లబ్‌లోకి చేరినందుకు చిత్ర టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలో చాలా మంది ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఓటిటి విడుదలపై అఫీషియల్ ప్రకటన రాకపోయినా, రిలీజ్ డేట్ అంటూ ఒక తేదీ ప్రచారంలోకి వచ్చింది. మాగ్జిమం అదే డేట్ కు ఓటిటిలోకి రావచ్చని చెప్తున్నారు. ఇంతకీ ఆ తేదీ ఏమిటి
Naga Chaithanya Thandel to Stream On this time in telugu
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి తండేలు మూవీ ఓటిటి మార్చి 6 నుంచి నెట్ ప్లిక్స్ లో కానుంది. అయితే ఇదేమీ సంస్ధ చేసిన ప్రకటన కాదు. 'తండేల్' ఓటీటీ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ రూ.65 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
'తండేల్' దర్శకుడు చందూ మొండేటి ప్రమోషన్ల సమయంలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఓటీటీ డీల్ పాటు రైట్స్ ద్వారానే బడ్జెట్‌లో సగానికి పైగా ఇప్పటికే రికవరీ అయ్యాయని వెల్లడించారు.
Naga Chaithanya Thandel to Stream On this time in telugu
తండేల్ అన్-సీజన్‌లో విడుదలైనప్పటికీ, ఆదివారాలు తప్ప సెలవులు లేనప్పటికీ, హెచ్‌డీ వెర్షన్ తొలిరోజే లీకైనప్పటికీ.. ఆవేమీ ‘తండేల్’పై ప్రభావం చూపించలేకపోయాయి. సెకండ్ వీకెండ్ ముగియక ముందే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
డొమస్టిక్ మార్కెట్లోనే కాక, తెలుగు రాష్ర్టాల్లోని డిస్ట్రిబ్యూటర్స్‌కు కూడా ‘తండేల్’ లాభదాయకమైన వెంచర్ అయ్యింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయి, లాభాల బాటలో పయనిస్తోంది. 'తండేల్' మూవీ శ్రీకాకుళం మత్స్యకారుల నిజజీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కింది.