- Home
- Technology
- Gadgets
- iPhone Discount : ఫ్లిప్‌కార్ట్ లో బంపర్ మే జంపర్ ఆఫర్.. రూ.59 వేలకే 128GB ఐఫోన్ పొందండి
iPhone Discount : ఫ్లిప్‌కార్ట్ లో బంపర్ మే జంపర్ ఆఫర్.. రూ.59 వేలకే 128GB ఐఫోన్ పొందండి
ఐఫోన్ కొనాలని చాలామందికి ఉంటుంది… కానీ ధర ఎక్కువని ఆగిపోతారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు అదిరిపోయే అవకాశం వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సేల్‌లో ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఆ ఆఫర్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్.. ఐఫోన్ 16 పై అదిరిపోయే డిస్కౌంట్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో యాపిల్ ఐఫోన్ 16పై బెస్ట్ డీల్ నడుస్తోంది. గత ఏడాది ఇండియాలో టాప్ సెల్లింగ్ ప్రీమియం ఫోన్‌గా నిలిచిన ఐఫోన్ 16, ఇప్పుడు లాంచ్ ధర కన్నా గణనీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో 128GB వేరియంట్ ధర రూ.62,900 కాగా, బ్యాంక్ ఆఫర్‌తో రూ.58,900కే సొంతం చేసుకోవచ్చు. దీని లాంచ్ ధర రూ.79,900. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌తో ధరను ఇంకా తగ్గించుకోవచ్చు.
ఐఫోన్ 16 ఫీచర్లివే..
ఫీచర్ల విషయానికొస్తే ఐఫోన్ 16లో యాపిల్ A18 చిప్ ఉంది. ఇది రోజువారి పనులు, మల్టీటాస్కింగ్, వీడియో ఎడిటింగ్, గేమింగ్ వంటి వాటిని చాలా వేగంగా చేస్తుంది. ఎక్కువసేపు వాడినా ఫోన్ వేడెక్కకుండా హీట్ మేనేజ్‌మెంట్ బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. అందుకే ఈ ధరలో ఇది ఒక పవర్‌ఫుల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుంది.
ఐఫోన్ 16 కెమెరా అదుర్స్
కెమెరా విషయానికి వస్తే ఐఫోన్ 16 లో 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఇచ్చారు. ఇందులో పగటిపూట వెలుతురు ఎక్కువున్నాా, రాత్రిపూట వెలుతురు తక్కువున్నా కూడా మంచి క్వాలిటీ ఫోటోలు తీయవచ్చు.. సోషల్ మీడియాలో తరచుగా ఫోటోలు, వీడియోలు షేర్ చేసేవారికి ఇది మంచి ఆప్షన్. అయితే ఈ మోడల్‌లో టెలిఫోటో లెన్స్ లేదు. అలాగే కొత్త ఐఫోన్ 17 సిరీస్‌లో వచ్చిన కొన్ని కెమెరా ఫీచర్లు ఇందులో ఉండవు.
ఐఫోన్ 16 బ్యాటరీ అదుర్స్
బ్యాటరీ విషయానికొస్తే… ఐఫోన్ 16 లో 3,561 mAh బ్యాటరీ ఉంది. సాధారణ వాడకంలో రోజంతా ఛార్జింగ్ వస్తుందని చెబుతున్నారు. కానీ ఛార్జింగ్ వేగం విషయంలో చాలా ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ మోడళ్లతో పోలిస్తే ఐఫోన్ 16 వెనుకబడింది. ఫాస్ట్ ఛార్జింగ్ కోరుకునేవారికి ఇది ఒక మైనస్ పాయింట్ కావచ్చు.
ఐఫోన్ 16 డిస్‌ప్లేలో 6.1 అంగుళాల OLED స్క్రీన్ ఇచ్చారు. రంగులు, బ్రైట్‌నెస్ బాగున్నప్పటికీ, 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉండటం కొందరిని నిరాశపరచవచ్చు. ఇప్పటికే 90Hz లేదా 120Hz ఆండ్రాయిడ్ ఫోన్లు వాడిన వారికి ఈ తేడా స్పష్టంగా తెలుస్తుంది.
మొత్తంగా చూస్తే రూ.58,900 ఆఫర్ ధరలో ఐఫోన్ 16 కొనడం మంచి డీల్ అనే చెప్పాలి. ముఖ్యంగా A18 చిప్, నమ్మకమైన కెమెరా, ఎక్కువ కాలం iOS అప్‌డేట్స్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. కానీ ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే లేదా ఫాస్ట్ ఛార్జింగ్ మీకు ముఖ్యమైతే, కొత్త ఐఫోన్ ప్రో మోడల్స్ లేదా ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో పోల్చి చూసి నిర్ణయం తీసుకోవడం మంచిది.

