ముల్లంగిని ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు.. దీన్ని ఈ సమయంలోనే తినాలి.. లేదంటే ఎన్నో సమస్యలొస్తయ్..
ముల్లంగి జీర్ణక్రియకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయినప్పటికీ దీన్ని తిన్న తర్వాత కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి. ఎందుకంటే..
If you eat radish, get rid of the disease!
మాంసంతో పోలిస్తే కూరగాయలే మన ఆరోగ్యానికి ఇంకా ఎక్కువ మేలు చేస్తాయి. అవి ఆకు కూరలైనా కావొచ్చు.. లేదా రూట్ వెజెటేబుల్స్ అయినా కావొచ్చు. అన్ని రకాల కూరగాయలు మనల్ని ఎన్నో వ్యాధుల ప్రమాదం నుంచి మనల్ని దూరంగా ఉంచుతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు వీటిని ఎక్కువగా తినాలని చెబుతుంటారు. అయితే కూరగాయల్లో ముల్లంగి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఏదేమైనా కానీ కొన్నిసార్లు ముల్లంగిని తినడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. దీనికి కారణం దీనిని సరిగ్గా తినకపోవడమేనంటున్నారు నిపుణులు.
ముల్లంగిని తినడం గుండె సంబంధిత వ్యాధులున్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు ఇది ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. చాలా మందికి కడుపు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. నిజానికి ముల్లంగిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. కానీ దీన్ని సరైన సమయంలో తినకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ వస్తాయి. కరెక్ట్ సమయంలో ముల్లంగిని తినకపోవడం వల్ల కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ముల్లంగి తినడం వల్ల కలిగే అసౌకర్యాన్ని నివారించడానికి దీన్ని సరైన సమయంలో తినడం ముఖ్యమంటారు నిపుణులు.
ఒకప్పుడు సీజన్ కు దగ్గ పంటలనే పండించేవారు. కానీ నేడు సీజన్లతో సంబంధం లేకుండా అన్ని సీజన్ల పంటలను పండిస్తున్నారు. వీటికి ఎన్నో రకాల రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి. ఇలాంటి కూరగాయల్లో ముల్లంగి కూడా ఉంది.
సాధారణంగా ముల్లంగిని పచ్చిగా సలాడ్ గా తినడానికి ఇష్టపడతారు. కొన్నిసార్లైతే ముల్లంగిని మాత్రమే తింటుంటారు. కానీ ఉదర సంబంధిత సమస్యలను నివారించడానికి ముల్లంగినే మాత్రమే కాకుండా దానితో పాటుగా ఇతర కూరగాయలను కూడా తినండి. ఈ విధంగా ముల్లంగి తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య వచ్చే అవకాశం ఉండదు. వాసన కూడా రాదు. డాక్టర్ సూచన మేరకు సన్నని, చిన్న చిన్న ముల్లంగిలనే మాత్రమే తీసుకోవాలి. అలాగే ముల్లంగితో పాటు కీరదోసకాయ, దోసకాయ, క్యారెట్, టమోటా, వేరుశెనగ, నిమ్మకాయలను సలాడ్ లో చేర్చండి. దీనివల్ల ముల్లంగితో ఎలాంటి సమస్యలు రావు.
ముల్లంగి జీర్ణం కావడానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. ఈ సమయంలో మీరు తిన్న ఇతర కూరగాయలు గ్యాస్ ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడతాయి. కూరగాయలన్నింటినీ సన్నగా తరిగి అందులో బ్లాక్ సాల్ట్ వేసి తినాలి.
ముల్లంగి తినడానికి సరైన సమయం
కొన్ని కూరగాయలను ఎప్పుడూ కూడా పరిగడుపున తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి కడుపునకు హాని కలిగిస్తాయి. ఈ లీస్ట్ లో ముల్లంగి కూడా ఉంది. ముల్లంగిని ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతో తినకూడదు. అలాగే ముల్లంగిని డిన్నర్ లో సలాడ్ గా కూడా ఎప్పుడూ తినకూడదు. ఇలా తింటే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడుతుంది.
నిపుణుల ప్రకారం.. వండిన కూరగాయలతో పాటుగా ముడి కూరగాయలను కూడా ఎప్పుడూ తినకూడదు. ముల్లంగిని లంచ్, డిన్నర్ మధ్య తినొచ్చు. ఈ సమయంలో తినడం వల్ల దీనిలో ఉండే అన్ని రకాల పోషకాలు మీకు అందుతాయి. అలాగే ఎలాంటి సమస్యలు కూడా రావు.
ఇలాంటి వారు ముల్లంగి తినకూడదు
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒంటి నొప్పులు ఉన్నవారు ముల్లంగిని తినకూడదు. ఎందుకంటే దీన్ని తినడం వల్ల కడుపు సమస్యలతో పాటుగా మరెన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముల్లంగి తిన్న వెంటనే కూర్చోవడం కూడా మంచిది కాదు. దీనివల్ల పొట్ట సమస్యలు వస్తాయి. అందుకే దీన్ని తిన్న తర్వాత శారీరకంగా చురుకుగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.