ఘనంగా ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
సినీనటి, చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా తన భర్త సెల్వమణి పుట్టినరోజు వేడుకల్నీ బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్’గా మారాయి
సెల్వమణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం (Facebook/Photo)
టాలీవుడ్ హీరోయిన్లలో డేరింగ్ & డాషింగ్ హీరోయిన్ గా పేరొందారు రోజా. సినిమాల్లో హీరోయిన్ గా నటించే రోజుల నుంచి తల్లి పాత్రలు చేసే ఇప్పటి వరకూ ఆమె ఒకేలా ఉండడం విశేషం. నటిగా.. వ్యాఖ్యాతగా, రాజకీయ నాయకురాలిగా ఆమె దూసుకెళ్తున్నారు. (Facebook/Photo)
ఆమె హీరోయిన్ గా మారిన తొలినాళ్ళలోనే ప్రేమలో పడిందట.. ఆపై కొన్నాళ్లకే పెళ్లి చేసుకుందామనే నిర్ణయం కూడా తీసుకుంది. కానీ పెళ్లికి మాత్రం పదకొండేళ్లు ఆగిందీ జంట. (Facebook/Photo)
రోజా ప్రేమించి & పరిణయమాడిన వ్యక్తి ప్రముఖ తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణి. వీరిద్దరి పరిచయం 1991లో చెన్నైలో ఒక షూటింగ్ సందర్భంగా జరిగింది. (Facebook/Photo)
తొలిసారిగా రోజాని చూసినప్పుడు ఆమె ఎరుపు రంగు దుస్తుల్లో కనిపించడం జరిగిందట, అయితే ఎరుపు రంగు అంటే సెల్వమణి గారికి చాలా ఇష్టమట. ఒకరకంగా మమ్మల్ని ఎరుపు రంగు కలిపింది అని ఆయన సరదాగా చెబుతుంటారు. (Facebook/Photo)
రోజా తనకు పరిచయం కాగానే ఆమె తన సినిమాలో హీరోయిన్ గా సరిపోతుంది అని నిర్ణయించుకుని తాను దర్శకత్వం వహిస్తోన్న చెంబురతి అనే తమిళ సినిమాలో ఆమెకు సెల్వమణి ఇవ్వడం జరిగింది. (Facebook/Photo)
ప్రశాంత్ హీరోగా నటించిన ఈ సినిమా షూటింగ్ జరిగే క్రమంలో రోజా సెల్వమణి ల మధ్య స్నేహం చిగురించింది. అయితే ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. (Facebook/Photo)
రోజాని ఇష్టపడిన సెల్వమణి, ఆ విషయాన్ని ముందుగా రోజాకి కాకూండా ఆమె తల్లిదండ్రులకి చెప్పడం.. రోజాతో పెళ్లి కి వారి అనుమతి కోరడం జరిగింది. (Facebook/Photo)
అసలు తనని ప్రేమిస్తున్నాను అని తనకి చెప్పకుండా నేరుగా తన కుటుంబంతో పెళ్లి గురించి మాట్లాడడమేంటి అని అనుకున్నప్పటికి .. అప్పటికే సెల్వమణి అంటే ఉన్న మంచి అభిప్రాయంతో ఆయనతో వివాహానికి అంగీకరించారు రోజా. (Facebook/Photo)
అయితే ఆ సమయంలో రోజాకి తెలుగులో చేసిన చిత్రాలు విజయవంతం అవ్వడంతో ఆమె హీరోయిన్ గా ఇంకొంత కాలం కొనసాగాలని భావించిందట. అదే విషయాన్నిసెల్వమణికి తెలపగా.. దానికి ఆయన కూడా సరేనన్నారు. (Facebook/Photo)
హీరోయిన్ గా కొద్దీ కాలం కొనసాగి ఆ తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్న వీరి వివాహం ఏకంగా 11 ఏళ్ళ పాటు వాయిదా పడింది. పదకొండేళ్ల తరువాత అంటే ఆగష్టు 10, 2002లో వీరి పెళ్లి జరిగింది. (Facebook/Photo)