MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లో దుస్తుల్లో జాన్వీ ...ఆ తెలుగు హీరో ఎడిక్ట్ , సెల్ నిండా ఆమె ఫొటోలే.?

లో దుస్తుల్లో జాన్వీ ...ఆ తెలుగు హీరో ఎడిక్ట్ , సెల్ నిండా ఆమె ఫొటోలే.?

ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించక పోయినప్పటికీ  తెలుగు సినిమా ఇండస్ట్రీ లో  మంచు గుర్తింపును దక్కించుకుంది. అందుకు కారణం తల్లి శ్రీదేవి అయినా, తన హాట్ హాట్ అందాల ప్రదర్శన కూడా మరో కాదనలేని కారణం.

4 Min read
Surya Prakash
Published : Dec 10 2022, 07:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
117

మొదట్లో జాన్వీ కపూర్ ఎవరూ అంటే...అతిలోక సుందరి శ్రీదేవి కూతురి అనేవారు. ఇప్పుడు జాన్వీ తల్లి శ్రీదేవి అనేలా క్రేజ్ తెచ్చుకుంటోంది.  చిన్న వయస్సులో ఓ సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor).ఇప్పుడు హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది. తన అందచందాలను ప్రపంచం ముందు పరవటానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. అయితే ఇలా రెచ్చిపోవటం వెనకాల ఆమె స్ట్రాటజీ ఏమిటి అనేది ప్రక్కన పెడితే ఓ తెలుగు హీరో మాత్రం ఆమెకు ఎడిక్ట్ అయ్యిపోతున్నాడట.
 

217
Image: Janhvi Kapoor/Instagram

Image: Janhvi Kapoor/Instagram


జాహ్నవి కపూర్ ఇప్పటికే ఈ సంవత్సరం గుడ్ లక్ జెర్రీ , మిలి  మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది.  క్రేజీ సినిమా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్నా జాహ్నవి కపూర్ ఈమధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వెరీ హాట్ లుక్ లో ఉన్న తన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అవి ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తెగ వైరల్ అవుతున్నాయి. 

317


తాజాగా జహ్నవి కపూర్ తన ఇన్స్టా లో కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.  ఈ ముద్దు గుమ్మ ఏకంగా "లో" దుస్తులు ఉన్న ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.మీరు ఇక్కడ చూస్తున్నవి అవే. ఇవి కేవలం సామాన్య జనాలే కాదు..ఓ యంగ్ హీరో సెల్ నిండా ఆమె ఫొటోలే అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. కానీ ఆమె అతని సినిమా చేస్తుందా....ఆ స్దాయి అతనికి ఉందా అంటున్నారు.

417
Janhvi Kapoor

Janhvi Kapoor

 ‘దఢక్’ (Dhadak)తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందే శ్రీదేవి అకాల మరణం చెందింది. జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తా అని చెప్పినప్పుడు శ్రీదేవి ఇందులోకి రావొద్దని సలహా ఇచ్చింది. ఈ విషయాన్ని జాన్వీ కపూరే చెప్పింది.  

517
Image: Janhvi Kapoor/Instagram

Image: Janhvi Kapoor/Instagram


  ‘‘నా జీవితమంతా సినిమాల్లోనే పనిచేశాను. మీకు మంచి జీవితాన్ని ఇచ్చాను. చిత్రాల్లో రాణించడం అంత సులభం కాదు. ఇందులోకి ఎందుకు రావాలనుకుంటున్నావు. సినిమాలంటే చాలా ఇష్టం ఉంటేనే ఇందులోకి రావాలి. నువ్వు చాలా సున్నిత మనస్కురాలివి. చిత్ర పరిశ్రమలో అనేక ఒడిదొడుకులు ఉంటాయి. వాటిని తట్టుకుని ఇక్కడ నిలబడాలి. ఆ విధంగా నిన్ను చూడటం నాకు ఇష్టం లేదు’’ అని శ్రీదేవి జాన్వీకీ చెప్పింది

617
Image Credit: Janhvi Kapoor Instagram

Image Credit: Janhvi Kapoor Instagram

అలాగే ‘‘నేను దక్షిణాది అమ్మాయినే! నేను ఉత్తరాదిన పెరిగి ఉండచ్చు... కానీ నా సంస్కృతి సంప్రదాయాలన్నీ దక్షిణాదివే! అందుకే చాలా సందర్భాలలో నేను దక్షిణాదికి చెందిన అమ్మాయిలా కనిపిస్తూ ఉంటా! చిన్నప్పుడు నాన్నగారి (బోనీకపూర్‌) షూటింగ్‌లు హైదరాబాద్‌లో ఎక్కువగా అవుతూ ఉండేవి. అందువల్ల ముందు హైదరాబాద్‌ వచ్చేదాన్ని. హైదరాబాద్‌లో కొద్ది కాలం ఉండి... ఆ తర్వాత తిరుపతి వెళ్లేదాన్ని. ఇప్పటికీ తిరుపతికి తరచూ వెళ్తూనే ఉంటా!

717


ఇప్పటిదాకా నేను టాలీవుడ్‌ సినిమాలు చేయలేదు. కానీ చేయాలని ఉంది. సమీప భవిష్యత్తులో తెలుగు సినిమాలు చేస్తాననే నమ్మకం ఉంది. మంచి పాత్ర కోసం ఎదురుచూస్తున్నా! ఇక్కడ ఒక విషయం చెప్పాలి. టాలీవుడ్‌ సినిమాలను చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. సాధారణంగా హిందీ టెలివిజన్‌ ఛానల్స్‌లో తెలుగు సినిమాలు డబ్‌ అయి వస్తూ ఉంటాయి. వాటికి మంచి క్రేజ్‌ ఉంది.

817
Janhvi Kapoor

Janhvi Kapoor


 ఈ చిత్రాల వల్ల దక్షిణాది సినిమాల గురించి ఉత్తరాది ప్రేక్షకులకు తెలిసింది. ఈ చిత్రాల వల్ల దక్షిణాది చిత్రాలు హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. ఇప్పుడు తెలుగు దర్శకుల, నటుల సినిమాలు నేరుగా విడుదల అవుతున్నాయి. వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. టాలీవుడ్‌లో అందరూ బాగా కష్టపడతారు. నా చిన్నప్పుడు అమ్మ షూటింగ్‌లో ఎంత కష్టపడి పనిచేసేదో నాకు తెలుసు.

917
Janhvi Kapoor

Janhvi Kapoor


తన కెరీర్ గురించి చెప్తూ...బాలీవుడ్‌లో నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమయింది. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. గ్లామరస్‌ పాత్రలతో పాటుగా ‘మిలీ’లో చేసిన పాత్రల్లాంటివి చేయాలనేది నా ఉద్దేశం. ‘మిలీ’లో నా నటనకు చాలా ప్రశంసలు వచ్చాయి. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో ‘మిస్టర్‌ అండ్‌ మిస్‌ మాహీ’లో పాత్ర చాలా కష్టమైనది. అందులో నేను క్రికెటర్‌ని. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో నా భుజానికి దెబ్బ తగిలింది. ఆ నొప్పి ఇంకా తగ్గలేదు.

1017
Janhvi Kapoor

Janhvi Kapoor


వాస్తవానికి ‘లైగర్’ (Liger) సినిమాతో జాన్వీ కపూర్‌ని సౌత్ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఎంతగానో ప్రయత్నించారు. ఈ విషయం ‘లైగర్’ ప్రమోషన్స్‌లో కూడా పూరి తెలిపారు. ‘లైగర్’ కంటే ముందు కూడా చాలా సినిమాల విషయంలో జాన్వీ కపూర్‌ సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. 

1117
Janhvi Kapoor

Janhvi Kapoor

బోనీకపూర్ కూడా జాన్వీకపూర్ సౌత్ ఎంట్రీ గురించి మాట్లాడారు కానీ.. సమయం ఉందని చెప్పారు. జాన్వీ మాటలు చూస్తుంటే.. ఇప్పుడాసమయం వచ్చేసినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే.. బాలీవుడ్‌లో చక్రం తిప్పాలని ఆమె ఎంతగా ప్రయత్నించినా.. బాక్సాఫీస్ వద్ద ఆమె చిత్రాలేవీ విజయం సాధించలేకపోతున్నాయి.. కేవలం ఓటీటీకే ఆమె చిత్రాలు అన్నట్లుగా అక్కడ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడామెకు బాలీవుడ్‌లో అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి.

1217
Janhvi Kapoor

Janhvi Kapoor


తన ఫిలాసపీ ఆమె చెప్తూ... కొందరు బయటకు ఒకలా కనిపిస్తారు. లోపల వేరే ఆలోచనలు ఉంటాయి. అంటే ఫిల్టర్స్‌ పెట్టుకుంటారన్నమాట! నేను కూడా మొదట్లో అలాగే ఉండేదాన్ని. నెమ్మదిగా ఫిల్టర్స్‌ అన్నీ వదిలేసా! నేను బయటకు ఎలా కనిపిస్తానో... లోపల కూడా అలాగే ఉంటా. మనస్సులో ఉన్న విషయాలను బయటకు చెప్పేస్తే మంచిది. కొన్ని సార్లు అలా చెప్పటం తప్పు కావచ్చు. కానీ తప్పులు చేయటం... వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవటమే మంచిది. దీని వల్ల మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అమ్మాయిలందరికీ నేను ఇచ్చే సలహా ఇదే!

1317
Janhvi Kapoor

Janhvi Kapoor


 జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో సైతం వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఎంట్రీ ఎన్టీఆర్ సినిమాతో అయితే బాగుంటుందని కూడా జాన్వీ భావిస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘NTR30’ సినిమా తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మొదట హీరోయిన్‌గా ఆలియా భట్ అనుకున్నారు.  కానీ ఆమె ప్రెగ్నెంట్ కావడంతో.. ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుంది.

1417
Janhvi Kapoor

Janhvi Kapoor


ఈ సినిమాకు సంబంధించి వచ్చిన తాజా అప్‌డేట్‌ ప్రకారం.. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఇందులో ఇంకా హీరోయిన్ కన్ఫర్మ్ కాలేదు. ఆ ఛాన్స్ కోసం జాన్వీ కపూర్ ట్రై చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. తన తాజా ఇంటర్వ్యూలో సౌత్‌లో ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నారనే ప్రశ్నకు.. ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా.. ఎన్టీఆర్ పేరు చెప్పేసింది. 

1517
Janhvi Kapoor

Janhvi Kapoor


ఎన్టీఆర్ అద్భుత నటుడని, ఆయనతో నటించేందుకు ఎంతోగానో వేచి చూస్తున్నానని.. జాన్వీ తెలిపింది. ఆమె ఈ సమాధానం తర్వాత.. ‘NTR30’ టీమ్ కూడా ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నిస్తునట్లుగా టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అన్నీ కుదిరితే మాత్రం ‘NTR30’లో జాన్వీ కపూర్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. 

1617


జాన్వీ కపూర్ ఈ  సంవత్సరం ‘గుడ్ లక్ జెర్రీ’ (Good Luck Jerry)లో నటించింది. సిద్దార్థ్ సేన్‌గుప్తా (Sidharth Sengupta) దర్శకత్వం వహించాడు. సుబాస్కరన్, ఆనంద్ ఎల్.రాయ్ (Aanand L. Rai) సంయుక్తంగా నిర్మించారు. దీపక్ దోబ్రియాల్, మితా వశిష్ట్, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ కీలక పాత్రలు పోషించారు.‘గుడ్ లక్ జెర్రీ’ డిస్నీ+హాట్‌స్టార్‌లో నేరుగా విడుదలయింది. 

1717

 అవన్నీ ప్రక్కన పెడితే ఆ యంగ్ హీర ో గారి సెల్ నిండా ఈమె ఫోటోలో ఉన్నాయని అంటున్నారు. ఆమెను తన సినిమాల్లోకి తీసుకోవాలని నిర్మాతలతో అంటున్నా లైట్ తీసుకుంటున్నారట. తన రెమ్యునరేష్ కూాడ తగ్గించుకుంటాను అంటున్నాడట.  అయితే అతని స్దాయికి ఆమెను అడగటం కూడా కష్టమే అని తేల్చేస్తున్నారు.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved