- Home
- Entertainment
- Tollywood Young Heros : టాలీవుడ్ లో అన్నల కంటే తమ్ముళ్లే బెటర్... ఇచ్చిపడేస్తున్న యంగ్ హీరోలు!
Tollywood Young Heros : టాలీవుడ్ లో అన్నల కంటే తమ్ముళ్లే బెటర్... ఇచ్చిపడేస్తున్న యంగ్ హీరోలు!
టాలీవుడ్ లో యంగ్ హీరోలు సత్తా చాటుతున్నారు. అన్న రెఫరెన్స్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తమదైన శైలిలో సినిమాలు చేస్తూ అదరగొడుతున్నారు. మరి ఆ హీరోలు ఎవరనే విషయాలు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda)... డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devekonda) తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ కథల విషయంలో అన్నను మించి పోయాడు. రీసెంట్ గా ‘బేబీ’ Baby Movieతో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. దీంతో నెక్ట్స్ సినిమాలపై అంచనాలు ఉన్నాయి.
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santosh Sobhan) ‘పేవర్ బాయ్’ నుంచి వరుస సినిమాలు చేస్తూనే వస్తున్నారు. ఇక ఆయన తమ్ముడు సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) కూడా మంచి సినిమాలతో అలరిస్తున్నాడు. చివరిగా ‘మ్యాడ్’ MAD మూవీతో రాబోతున్నారు.
మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు, మనోజ్(Manchu manoj) ఇద్దరు హీరోలుగా అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి కెరీర్ మొత్తంగా అన్న విష్ణు కంటే.. తమ్ముడు మనోజ్ సినిమాల కథలనే ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
ఇక నందమూరి వంశం నుంచి మూడో తరంలో ప్రస్తుతం కళ్యాణ్ రామ్ (Kalyan Ram), యంగ్ టైగర్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ అన్న కళ్యాణ్ కంటే తమ్ముడు తారక్ సినిమా కథలనే ప్రేక్షకులు మెచ్చుతుంటారు.
మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, వరుణ్ తేజ్ (Varun Tej) విషయంలో... అప్పట్లో చరణ్ కంటే వరుణ్ ఎంచుకున్న సినిమా కథలే బాగున్నాయి. ‘కంచె’, ‘అంతరిక్షం’, ‘తొలిప్రేమ’ వంటి సినిమాలు ఏరేంజ్ లో ఉన్నాయో తెలిసిందే. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ గ్లోబల్ స్టార్ క్రేజ్ దక్కించుకొని అందనంత ఎత్తుకు ఎదిగారు. ఇప్పుడు చెర్రీ ప్రాజెక్ట్స్ ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ గా ఉన్నాయి.
కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya), ఆయన తమ్ముడు కార్తీ (Karthi) ఇద్దరు తెలుగు ఆడియెన్స్ కు సుపరిచితమే. అయితే వీరిద్దరి సినిమా కథల విషయంలోనూ తమ్ముడు కార్తీనే అన్నకంటే కాస్తా డిఫరెంట్ గా ఎంపిక చేస్తుంటారని ఆయన అభిమానుల ఫీలింగ్.. కొన్ని ఆడకపోయినా సినిమాలు మాత్రం గుర్తుండిపోతాయి.