- Home
- Entertainment
- చిరుత కళ్లు.. చిరునవ్వులతో.. కాలర్ ఎగరేస్తున్నఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ న్యూ లుక్స్ వైరల్..
చిరుత కళ్లు.. చిరునవ్వులతో.. కాలర్ ఎగరేస్తున్నఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ న్యూ లుక్స్ వైరల్..
గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతుండగా.. మరోసారి వారికి కనుల విందు చేశారు తారక్. న్యూ లుక్స్ తో అదరగొట్టాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించాడు తారక్. ఆస్కార్ రేంజ్ లకు వెళ్ళిన ఈ నందమూరి హీరో క్రేజ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అంతే కాదు ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కవర్ పేజీల మీద కూడా తారక్ ఫోటో మెరిసింది.
తాజాగా తారక్ డిఫరెంట్ మూడ్‌లో ఉన్న స్టిల్స్‌ను నెట్టింట వైరల్ అవుతున్నాయి.చిరువుత్తో.. చిరుత కళ్ళతో.. కాలర్ ఎగరేస్తున్న స్టిల్ అందరి చూపు తన వైపునకు తిప్పుకుంటున్నాడు యంగ్ టైగర్. మాస్ యాటిట్యూడ్ చూపిస్తున్నట్టుగా ఉన్న ఈ స్టిల్‌కు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
తారక్ తాజాగా ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆ షూట్ లో తీసిన స్టిల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన దేవర ఫస్ట్ లుక్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. తారక్ మరోవైపు కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ 31కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దేవర షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఫ్యాన్స్ కోసం ఎన్ని మెట్లు దిగడానికి అయినా.. ఎన్టీఆర్ వెనకాడడు. అంతే కాదు తన ఫ్యాన్స్ కోసం ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలో.. వారి నాడి తెలుసుకుని అభిమానులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ అందించడంలో ఎప్పుడూ బిజీగా ఉంటారు తారక్.
Image: Devara new poster / Instagram
అటు సోషల్ మీడియాలో కూడా ఎన్టీఆర్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రతీ విషయాన్ని తన ట్విట్టర్ లో అప్ డేట్ చేస్తూ.. స్టార్స్ కు సబంధించిన అకేషన్స్ న్స్ కు విష్ చేస్తూ.. ఉంటాడు ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో భారీ బడ్జట్ తో.. పాన్ ఇండియా మూవీని చేస్తోన్న తారక్.. దేవర టైటిల్ తో.. పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.
ఎన్టీఆర్ 30గా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.