Yogi Babu: కారు యాక్సిడెంట్ నిజమే కానీ,క్షేమమే అంటూ యోగిబాబు
Yogi Babu: తమిళ కమెడియన్ యోగిబాబు కారు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. అయితే, యోగిబాబు స్వయంగా ఈ వార్తల ట్వీట్ చేసారు. ప్రమాదం జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ, ఆ కారులో తాను లేనని ఆయన స్పష్టం చేశారు.

Yogi Babu Denies Claims Of Car Accident While Travelling To Bengaluru in telugu
Yogi Babu: తమిళ కమెడియన్ యోగిబాబు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియన్స్‌కి కూడా పరిచయమే. పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆయన మెప్పించారు. అయితే రీసెంట్ గా యోగిబాబు ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అయినట్లు వార్తలు వచ్చాయి.
తమిళనాడులోని రాణి పేటలో యోగిబాబు ఉన్న కారు.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బారీకేఢ్‌ని ఢీ కొట్టినట్లు కోలీవుడ్ మీడియాలో చెప్పుకొచ్చింది. దాంతో ఆయన అభిమానులు కంగారు పడ్డారు. దాంతో సోషల్ మీడియా ద్వారా యోగిబాబు స్వయంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.
Yogi Babu Denies Claims Of Car Accident While Travelling To Bengaluru in telugu
తమిళ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం యోగిబాబు తన వ్యక్తిగత డ్రైవర్‌తో కలిసి రాణిపేటలో ప్రయాణిస్తున్న సమయంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పి బారికేడ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం సమయంలో కారులో ఉన్న వారందరినీ ఎలాంటి ప్రాణాపాయం వాటిల్లలేదు.
యోగిబాబుకు స్వల్ప గాయాలు కావచ్చు కానీ, అతడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. అయితే యోగిబాబు అసలు ఈ వార్తలు అన్ని ఫేక్ అంటూ ఖండించారు. అయితే ఆ ఖండన..యాక్సిడెంట్ నిజమే కానీ కన్ఫూజన్ తో సాగింది.
Yogi Babu Denies Claims Of Car Accident While Travelling To Bengaluru in telugu
ఓ తమిళ ఛానల్ సోషల్ మీడియాలో తన కారు యాక్సిడెంట్ గురించి షేర్ చేసిన వార్తని ట్వీట్ చేస్తూ యోగిబాబు క్లారిటీ ఇచ్చారు. నేను క్షేమంగానే ఉన్నాను.. ఇది ఫేక్ న్యూస్ అంటూ ఆ ట్వీట లో ఉంది. తన కారు యాక్సిడెంట్ గురించి షేర్ చేసిన వార్తను ట్వీట్ చేసిన ఆయన.. అది ఫేక్ న్యూస్ అంటూ స్పష్టత ఇచ్చారు.
రోడ్డు ప్రమాదం అయితే జరిగింది కానీ ఆ కారులో తాను లేనని.. కనీసం తన సహాయకుడు కూడా లేడని చెప్పారు. దాంతో ఇందులో ఫేక్ న్యూస్ ఏముంది. యాక్సిడెంట్ జరగడం అబద్ధమా కాదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. . అయితే యాక్సిడెంట్ జరగడం నిజమే కానీ యోగిబాబు సేఫ్‌గా ఉన్నారనేది నిజం ఇది హ్యాపీ ఫీలయ్యే విషయం.