ప్రముఖ ఓటీటీ సంస్థకు ‘యశోద’ డిజిటల్ రైట్స్.. ఎంతకు డీల్ కుదిరింది?
స్టార్ హీరోయిన్ సమంత నటించిన సై-ఫై చిత్రం ‘యశోద’ (Yashoda). ఈ రోజు గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఓటీటీ రైట్స్ పైనా అప్డేట్ అందింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన సైంటిఫిక్ యాక్షన్ ఫిల్మ్ ‘యశోద’. మహిళా-కేంద్రీకృతమైన సైన్స్ ఫిక్షన్ మరియు ఎమోషనల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దర్శక ద్వయం హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈరోజు (నవంబర్ 11)న థియేటర్లలో విడుదల చేశారు. తొలిరోజు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ తొలిషోలతో మంచి స్పందననే అందుకుంది. ఇప్పటికే అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసిన ఈ చిత్రం.. ఓటీటీ రైట్స్ పైనా అప్డేట్ అందింది. తాజా సమాచారం ప్రకారం భారీ డీల్ కే డిజిటల్ రైట్స్ అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ మీడియో (Amazon Prime Video) ‘యశోద’ డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. నివేదికల ప్రకారం రూ.45 కోట్ల రూపాయలకు డీల్ కుదిరిందని సమాచారం. ఇప్పటికే చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో ఆ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.
ఈరోజే థియేటర్లలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడంతో ఓటీటీలోకి వచ్చేందుకు ఇంకాస్తా సమయం పడుతుంది. ఎనిమిది వారాల లోపు ఓటీటీలో స్ట్రీమింగ్ సిద్ధంకానుంది. మరోవైపు డిసెంబర్ నుంచే ప్రసారం కానుందని అంటున్నారు. ప్రస్తుతం థియేటర్లలో ‘యశోద’ హవా కొనసాగనుంది.
ఆరోగ్య సమస్యల కారణంగా సమంత ‘యశోద’ సినిమాను బాగా ప్రమోట్ చేయలేకపోయింది. అయినా చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. దీంతో యూనిట్ మొత్తం ఖుషీ అవుతోంది. చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేష్, దివ్య శ్రీపాద మరియు ప్రియాంక శర్మ కీలక పాత్రల్లో నటించారు.