- Home
- Entertainment
- Ibomma: పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ కి రెడీ అయితే ఇలా జరిగిందేంటి..క్రేజీ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అదుర్స్
Ibomma: పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ కి రెడీ అయితే ఇలా జరిగిందేంటి..క్రేజీ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అదుర్స్
Yami Gautam Dhoom Dhaam movie: హీరోయిన్ యామి గౌతమ్ తెలుగు వారికి కూడా సుపరిచయమే. యామి గౌతమ్ తెలుగులో యుద్ధం, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి చిత్రాల్లో నటించింది. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంలో కీలక పాత్రలో నటించి మరింతగా పాపులర్ అయింది.

Yami Gautam Dhoom Dhaam Movie
హీరోయిన్ యామి గౌతమ్ తెలుగు వారికి కూడా సుపరిచయమే. యామి గౌతమ్ తెలుగులో యుద్ధం, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి చిత్రాల్లో నటించింది. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంలో కీలక పాత్రలో నటించి మరింతగా పాపులర్ అయింది. ఉరి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్య ధార్ నే యామి గౌతమ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2021లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Dhoom Dhaam Movie
వివాహం తర్వాత కూడా యామి గౌతమ్ సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా యామి గౌతమ్ ధూమ్ ధామ్ అనే చిత్రంలో నటించింది. రిషబ్ సేథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యామి భర్త ఆదిత్య ధార్ కూడా ఒక నిర్మాత కావడం విశేషం. ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ, యామి గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. డైరెక్ట్ గా ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయింది.
Dhoom Dhaam Movie
తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వస్తోంది. ఒక రాత్రి జరిగే ఛేజింగ్ కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా ఎలా ఉన్నా యామి గౌతమ్ మాత్రం తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసినట్లు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ఓటిటిలోకి రాగానే ఐబొమ్మలో కూడా లీక్ అయిపోయింది.
Dhoom Dhaam Movie
కథ విషయానికి వస్తే.. వీర్ ఖురానా( ప్రతీక్ గాంధీ), కోయల్ చద్దా( యామి గౌతమ్) ఇద్దరూ పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ కి రెడీ అవుతారు. వీళ్ళిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవడం ప్రారంభించే లోపే కాలింగ్ బెల్ మోగుతుంది. డోర్ తెరిచి చూస్తే చార్లీ ఎక్కడ అంటూ రౌడీలు తుపాకీతో బెదిరిస్తారు. అక్కడి నుంచి తన భర్తని కాపాడుకోవడం కోసం యామి గౌతమ్ ఛేజింగ్ మొదలు పెడుతుంది. డైరెక్టర్ ఈ చిత్రాన్ని ఫన్ యాక్షన్ అంశాలతో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఐబొమ్మలో టాప్ లో ట్రెండ్ అవుతోంది.