బ్యాంక్ ఉద్యోగి నుంచి అగ్ర గీత రచయిత వరకు అసాధారణమైన సినీ ప్రస్థానం..
First Published Jan 5, 2021, 6:36 PM IST
వెన్నెలకంటి.. తెలుగు సినిమా సాహిత్యంలో ఆయనది ప్రత్యేక స్థానం. సాహిత్యంలోని లోతులను పాటల రూపంలో ప్రాణం పోశారు. సాహిత్యానికి గ్లామర్ అద్దారు. తెలుగు సినీ సాహిత్యంలో మూడున్నర దశాబ్దాలుగా విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించిన వెన్నెలకంటి అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకి తీరని లోటు. కొత్త ఏడాది వేళ వెన్నెలకంటి మరణం టాలీవుడ్‌ని విషాదంలో ముంచెత్తింది.

వెన్నెలకంటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో పాపులర్ అయిన ఆయన అసలు పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. డబ్బింగ్ పాటలతో పాపులర్ అయిన వెన్నెలకంటి పాటల రైటర్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

నెల్లూరులోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వెన్నెలకంటి సినీ ప్రస్థానం విభిన్నంగా ప్రారంభమైంది. ఆయన తమ ఊరు దగ్గరలో ఉండే విజయలక్ష్మి టాకీసులో ఎక్కువగా పౌరాణిక సినిమాలు చూసేవారట. వాటిని ఒకటికి రెండు మూడు సార్లు చూసేవారు. ఆ సినిమాల ద్వారానే తనకు సాహిత్యం పట్టు, ఆసక్తి ఏర్పడేలా చేసింది. థియేటరే ఆయనకు గురువయ్యింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?