ప్రపంచంలోనే భారీ సంపద ఉన్న హీరోలు వీరే.. టాప్ 10 లో మన ఇండియన్ హీరో ఎవరో తెలుసా..?
ప్రపంచంలో ఇతర రంగాలను మించి సంపాదన కలిగి ఉంది సినిమా రంగం. హాలీవుడ్ కాని.. బాలీవుడ్ కాని... మన టాలీవుడ్ కాని.. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోలు.. వాటిని ఇతర రంగాలలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. వేల కోటుల కలిగి ఉన్న హీరోలు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇక ప్రస్తుతం ప్రపంచంలోనే భారీగా ఆస్తులు కలిగి ఉన్న టాప్ 10 హీరోలు ఎవరు.. వారి సంపద ఎంత అనేది చూద్దాం. అందులో మన ఇండియాన్ హీరోలు ఉన్నారా..?
sharukh
ప్రపంచంలోని అత్యంత సంపన్న నటుల జాబితాలో హాలీవుడ్ అగ్రనటులు ఎంతో మంది ఉన్నారు. అందులో ఉన్న ఏకైక భారతీయ నటుడు షారుఖ్ ఖాన్. ప్రపంచంలోని టాప్-10 ధనవంతులు, అత్యధిక పారితోషికం పొందిన హీరోల జాబితాలో ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక టాప్ 10 స్టార్స్ ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
టైలర్ పెర్రీ-(Tyler Perry )--- $1 బిలియన్ డాలర్లు.. హాలీవుడ్ లో ఆఫ్రికన్-అమెరికన్ అడ్వెంచర్ ఫిల్మ్స్ చేయడంలోదిట్ట.. ప్రయోగాల వీరుడు. సాహసాలు చేయడం అంటే చాలా ఇష్టం.,
జెర్రీ సీన్‌ఫెల్డ్-(Jerry Seinfeld)--- $925 మిలియన్ డాలర్లు ఇతను చాలా కష్టపడి పైకి వచ్చాడు. న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్‌లో జన్మించాడు. అతని తండ్రి, కల్మాన్ సీన్‌ఫెల్డ్, సైన్ పెయింటర్.
డ్వైన్ జాన్సన్-(Dwayne Johnson )---$800 మిలియన్ డాలర్లతో మూడో ప్లేస్ లో ఉన్నాడు. డ్వేన్ డగ్లస్ జాన్సన్ ను రెస్ట్లెర్ గా ఉంటునప్పటినుండి ది రాక్ అని పిలుస్తున్నారు, జాన్సన్ అమెరికన్-కెనడియన్ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, రిటైర్డ్ ప్రొఫెషనల్ రెజ్లర్, మాజీ అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడు కూడా.
షారుఖ్ ఖాన్-(Shah Rukh Khan)---$730 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇండియా నుంచి ఈ జాబితాలో ఉన్న ఏకైక హీరో. సీరియల్స్ నుంచి సినిమాలు.. స్టార్ గా ఎదిగి.. బాలీవుడ్ ను ఏలుతున్నాడు షారుఖ్. బాలీవుడ్ లో రికార్డ్ ల వేటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.
టామ్ క్రూజ్-(Tom Cruise)--- $600 మిలియన్ డాలర్లతో ఐదో ప్లేస్ లో ఉన్నాడు. టామ్ క్రూజ్ హాలీవుడ్ నటుడు, నిర్మాత. ఇతను 1983 లో 'రిస్కీ బిజినెస్' సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించాడు. టామ్ క్రూజ్ రెండు సార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇతను మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లోగూఢచారిగా నటించి ఫేమస్ అయ్యాడు.
George Clooney
జార్జ్ క్లూనీ-(George Clooney)--- $500 మిలియన్ డాలర్లతో ఆరో ప్లేస్ లో ఉన్నాడు. జార్జ్ తిమోతీ క్లూనీ ఒక అమెరికన్ నటుడు మరియు నిర్మాత. అతను బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డు, నాలుగు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు మరియు రెండు అకాడమీ అవార్డులతో సహా అనేక అంతర్జాతీయ అవార్డ్ లు అందుకున్నాడు.
రాబర్ట్ డి నీరో- (Robert De Niro)--- $500 మిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. రాబర్ట్ ఆంథోనీ డి నిరో జూనియర్. ఒక అమెరికన్ నటుడు. 2009లో, డి నీరో కెన్నెడీ సెంటర్ ఆనర్స్‌ను అందుకున్నాడు మరియు 2016లో US అధ్యక్షుడు బరాక్ ఒబామా నుండి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను పొందాడు.
arnold schwarzenegger
ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్- (Arnold Schwarzenegger)--- $450 మిలియన్ డాలర్లతో ఎనిమిదోవ ప్లేస్ లో ఉన్నారు. ఆర్నాల్డ్ అలోయిస్ స్క్వార్జెనెగర్ జూలై 30, 1947 లో జన్మించారు. ఆయన ఒక ఆస్ట్రియన్ మరియు అమెరికన్ నటుడు, వ్యాపారవేత్త, చిత్రనిర్మాత, మాజీ రాజకీయవేత్త. స్టేట్ గవర్నర్ గా కూడా పనిచేశారు.
కెవిన్ హార్ట్-(Kevin Hart) --- $450 మిలియన్ డాలర్లతో తొమ్మిదోవప్లే స్లో ఉన్నాడు. కెవిన్ డార్నెల్ హార్ట్ ఒక అమెరికన్ హాస్యనటుడు అనేక స్టాండ్-అప్ కామెడీ పోటీలలో గెలుపొందిన తర్వాత ఇండస్ట్రీలో అడుగు పెటట్ాడు. టీవీ సీరియల్స్ నుంచి హాలీవుడ్ నటుడిగా ఎదిగాడు.
ఆడమ్ సాండ్లర్- (Adam Sandler)--- $420 మిలియన్ డాలర్లతో పదోవ ప్లేస్ లో ఉన్నాడు. ఆడమ్ రిచర్డ్ శాండ్లర్ ఒక అమెరికన్ నటుడు మరియు హాస్యనటుడు. ప్రధానంగా చలనచిత్రాలలో హాస్య ప్రముఖ నటుడు, అతని ప్రశంసలలో మూడు గ్రామీ అవార్డులు, ఐదు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు మరియు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డులు ఉన్నాయి. 2023లో, శాండ్లర్‌కు అమెరికన్ హాస్యం కోసం మార్క్ ట్వైన్ ప్రైజ్ లభించింది.