త్రివిక్రమ్ - మహేశ్ సినిమా ఆగిపోతుందా.. అంతకంతకూ ఆలస్యం.. అప్పటి నుంచే బ్యాడ్ టైం!
సూపర్ స్టార్ మహేశ్ బాబు - దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ28’. ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ మూవీ అంతకంతకూ ఆలస్యం అవుతోంది. పైగా మహేశ్ కూ మంచి జరగడంపోవడంతో సినిమా ఆగిపోతుందని అంటున్నారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) చివరిగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే.. మహేశ్ బాబు - త్రివిక్రమ్ చిత్రం కూడా అనౌన్స్ చేశారు. గతేడాది మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘ఎస్ఎస్ఎంబీ28’ని అనౌన్స్ చేశారు.
పదేండ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ ను మళ్లీ సెట్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ‘అతడు’, ‘ఖలేజా’తో పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. అప్పటికే త్రివిక్రమ్ వరుస హిట్లను అందుకోవడంతో ‘ఎస్ఎస్ఎంబీ28’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే, ఈపాటికే SSMB28 ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. సినిమా అనౌన్స్ చేసి ఏడాదిన్నర దాటినా ఇంకా షూటింగ్ కూడా పూర్తికాలేదు. ఎప్పుడూ ఏదోలా సినిమా ఆలస్యం అవుతూనే వస్తోందని అంటున్నారు. మరోవైపు ఈ మూవీ ప్రారంభం అయినప్పటి నుంచి మహేశ్ బాబుకూ బ్యాడ్ టైం మొదలైందంటున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సెట్స్ మీదకు వెళ్ళక చాలా కాలం అవుతుండగా.. సెప్టెంబర్ లోనే చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ28’తో మళ్లీ సెట్స్ మీదకు వచ్చారు. సినిమా ప్రారంభం అవ్వగానే.. అదే నెల చివర్లో మహేశ్ తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. ఆ బాధనుంచి కోలుకునే లోపే మరో విషాద ఘటన కూడా జరిగింది.
మూడు రోజుల కింద సీనియర్ నటుడు, నట శేఖరుడు క్రిష్ణ (Krishna) కూడా తుదిశ్వాస విడిచారు. మహేశ్ ను వెన్నంటే నడిపించిన క్రిష్ణ మరణించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకే ఏడాదిలో అన్న రమేశ్ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి క్రిష్ణ ను కోల్పోవడంతో పుట్టెడు బాధను అనుభవిస్తున్నారు.
ఇప్పుడప్పుడే మహేశ్ బాబు నార్మల్ స్థితికి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. కనీసంగా నెల రోజులకు పైగానే సమయం పడుతుందని అంటున్నారు. ‘ఎస్ఎస్ఎంబీ28’ ప్రారంభం తర్వాత మహేశ్ కు ఇలా జరగడం పట్ల అభిమానులు కూడా బాధపడుతున్నారు.
మరోవైపు, గతంలో విడుదలైన ‘ఖలేజా’ వసూళ్ల పరంగా నిరాశ పరిచింది. అప్పటి నుంచి వీరి సినిమా రాకపోవడం.. ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎంబీ28’ ప్రారంభమైనా ఆల్యసం అవుతూ వస్తుండటం.. మరోవైపు హీరోయిన్ పూజా హెగ్దేకు కూడా కాలికి గాయడం అవడంతో బ్యాడ్ టైం వల్లే ఇలా జరుగుతుందని నెటిజన్లు అంటున్నారు. ఈ క్రమంలో సినిమా ఆగిపోతుందా అని అభిప్రాయపడుతున్నారు.