Jabardasth-Nagababu: జబర్దస్త్ రగడ... నాగబాబు ఎంట్రీ కోసం అంతా వెయిటింగ్!
జబర్దస్త్ షో కేంద్రంగా పెద్ద రగడ నడుస్తుంది. ఒకప్పటి జబర్దస్త్ టీమ్ లీడర్ కిరాక్ ఆర్పీ మల్లెమాలపై దారుణమైన ఆరోపణలు చేశారు. సరైన ఫుడ్ పెట్టరని, రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఇస్తారని విమర్శలు గుప్పించాడు. మల్లెమాల సంస్థ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Nagababu
కిరాక్ ఆర్పీ ఆరోపణలను కొందరు సమర్ధించగా మెజారిటీ జబర్దస్త్ నటులు ఖండించారు. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ తో పాటు షేకింగ్ శేషు కిరాక్ ఆర్పీ చెబుతున్న దాంట్లో నిజం లేదన్నారు. అలాగే షేకింగ్ శేషు అన్నం పెట్టిన సంస్థ గురించి ఇలా తప్పుగా మాట్లాడటం సరికాదన్నారు. ఆర్పీ దర్శకుడిగా మారి నిర్మాతకు రూ. 20 లక్షల నష్టం చేకూర్చినట్లు ఆరోపణలు చేశారు.
Sudigali Sudheer
తాజాగా జబర్దస్త్ షో ఆరంభంలో మేనేజర్ గా పని చేసిన ఏడుకొండలు మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కి కిరాక్ ఆర్పీ ఆరోపణలపై ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. సదరు ఇంటర్వ్యూలో ఆయన ఆర్పీపై మండిపడ్డాడు. కిరాక్ ఆర్పీ షోని వదిలేసి నాలుగేళ్లు అవుతుంది. ఇప్పుడు ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. మల్లెమాలలో మంచి ఫుడ్ పెడతారని, టైం కి పేమెంట్ ఇస్తారని తెలియజేశారు.
Nagababu
ఈ క్రమంలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులపై కూడా ఏడుకొండలు ఆరోపణలు చేయడం విశేషం. నేను లైఫ్ ఇస్తే సుధీర్ నా ఫోన్ ఎత్తడం లేదు. జబర్దస్త్ వదిలేసిన గెటప్ శ్రీను బయట షోస్ చేయలేడు. వీళ్ళ గురించి నాకు అంతా తెలుసు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అవసరమైతే మరో ఇంటర్వ్యూలో అన్ని విషయాలు వెల్లడిస్తా అన్నారు.
Niharika Konidela
జబర్దస్త్ షో చుట్టూ ఇంత రగడ జరుగుతున్న నేపథ్యంలో నాగబాబు ఎంట్రీ ఎప్పుడని అందరూ ఎదురుచూస్తున్నారు. కారణం జబర్దస్త్ నిర్మాతలపై ఫస్ట్ ఆరోపణలు చేసిన ఘనత నాగబాబుదే. 2013 నుండి 2019 వరకు దాదాపు ఆరేళ్ళు ఆ షో జడ్జిగా ఉన్న నాగబాబు బయటికి వచ్చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన కూడా రెమ్యూనరేషన్స్, ఫుడ్ వంటి విషయాలు లేవనెత్తారు.
Nagababu
ఇక ప్రస్తుత కిరాక్ ఆర్పీ ఆరోపణలు, విమర్సల వెనుక నాగబాబు ఉన్నారనేది పరిశ్రమలో నడుస్తున్న టాక్. సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, రోజా వంటి స్టార్స్ నిష్క్రమణతో జబర్దస్త్ కొంత ఫేమ్ కోల్పోయింది. జబర్దస్త్ ని దెబ్బతీసేందుకు ఇదే సరైన సమయంగా ఆయన భావిస్తున్నట్లు కొందరి వాదన.
Nagababu - Pawan Kalyan
ఇక తన ప్రియ శిష్యుడు కిరాక్ ఆర్పీపై మూకుమ్మడి దాడి జరుగుతుంది. షేకింగ్ శేషు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, ఏడుకొండలు ఆర్పీని తప్పుబట్టారు. ఈ క్రమంలో నాగబాబు రంగంలోకి దిగే అవకాశం కలదంటున్నారు. మరోవైపు జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నాగబాబు ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోతేనే మంచిదని భావించవచ్చు.